సమ్మె విరమణ పై ఆర్టీసీ కార్మిక సంఘాల మధ్య విభేదాలు

Differences of RTC Trade unions on strike

ఆర్టీసీ సమ్మె విరమణ విషయంలో కార్మిక సంఘాల మధ్య అభిప్రాయభేదాలు తలెత్తాయి. షరతులు లేకుండా విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమించేందుకు సిద్ధమని ఆర్టీసీ జేఏసీ చేసిన ప్రకటనపై టీజేఎంయూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఆర్టీసీ జేఏసీ సమ్మె విరమించినా.. జేఏసీ-1 సమ్మె విరమించేది లేదని టీజేఎంయూ ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్‌ తెలిపారు. ఆర్టీసీ కార్మికులు ఇంతమంది చనిపోయిన తరువాత, ఇన్ని రోజులు కార్మికులు బాధపడిన ఎలాంటి డిమాండ్లు పరిష్కారం కాకుండా సమ్మె విరమించడం సమంజసం కాదని టీజేఎంయూ ప్రధాన కార్యదర్శి అంటున్నారు. ఇప్పటివరకు సమ్మెలో 29మంది ఆర్టీసీ కార్మికులు మరణించారని ఆయన తెలిపారు. మరణించిన కుటుంబాలను ఎవరూ ఆదుకోలేదని తెలిపారు. దీనికితోడు సమ్మెలో భాగంగా రాష్ట్రంలోని పలు డిపోల పరిధిలో కార్మికులపై కేసులు కూడా నమోదయ్యాయని, వాటిపై ఏం మాట్లాడకుండా సమ్మె విరమిస్తున్నామని జేఏసీ చెప్పడం.. కార్మికులను మోసం చేయడమేనని హనుమంతు మండిపడ్డారు.

ఇలా విరమించాలనుకున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చినప్పుడే సమ్మె విరమిస్తే సరిపోయేదని, కార్మికుల అనవసరంగా బలిపశువులను చేసి ఇప్పుడు జేఏసీ సమ్మె విరమణ ప్రకటన చేసిందని ఆయన అన్నారు. ఆర్టీసీ జేఏసీ కేవలం మూడు కార్మిక సంఘాలను కలుపుకొని మాత్రమే ముందుకు వెళ్తోందన్నారు. జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి అసమర్థత వల్లే ఆర్టీసీలో సమస్యలు పేరుకుపోయాయని ఆయన మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికులు చాలావరకు పేద వాళ్ళు అని, ఆర్టీసీ సంస్థను నిర్వీర్యం చేయకుండా కాపాడాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సీఎం కేసీఆర్ తమను పిలిచి కార్మికుల సమస్యల గురించి తెలుసుకోవాలని కోరుతున్నామని అన్నారు. ఏది ఏమైనా 47 రోజులు పాటు సాగిన ఆర్టీసీ కార్మికుల సమ్మె ఏ సమస్యలను పరిష్కరించ లేదని, కార్మికులకు న్యాయం జరగలేదని తేటతెల్లం చేస్తుంది.

tags: ts rtc strike, rtc strike, rtc jac, ashwatthama reddy, rtc workers union, cm kcr, telangana, tjmu, hanumanthu

కార్మికుల కోసం సీఎం కేసీఆర్ తో మాట్లాడనున్న నితిన్ గడ్కరీ

చాలా రోజుల తర్వాత మహిళా సదస్సులో పాల్గొన్న కవిత..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *