ఇండియన్-2 ఆగిపోయినట్టేనా?

Director Shankar escape the Indian 2

ఏ ముహుర్తానా ఇండియన్-2 మూవీ మొదలుపెట్టారోకానీ.. ఆ సినిమాకు అడుగడుగునా అడ్డంకులే ఎదురవుతున్నాయి. బడ్జెజ్ కారణంగా కొన్నాళ్లు సినిమాకు బ్రేక్ పడింది. ఆ తర్వాత కరోనా వల్ల షూటింగ్ నిలిచిపోయింది. డైరెక్టర్ శంకర్ కు, ప్రోడక్షన్ కు పడకపోవడంతో మరికొన్ని రోజులు షూటింగ్ నిలిచిపోయింది. స్వయంగా హీరో కమల్ హాసన్ కలుగుజేసుకొని రాజీ కుదర్చాడు.

తిరిగి షూటింగ్ ప్రారంభించిన శంకర్ కోలుకోని దెబ్బ తగిలింది. షూటింగ్ సమయంలో భారీ క్రేన్ విరిగిపడటం, యూనిట్ మెంబర్స్ చనిపోవడం లాంటి విషయాలు శంకర్ ను దెబ్బతిశాయి. నిర్మాణ సంస్థ నిర్లక్షం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని శంకర్ నిర్మాతలపై విరుచుకుపడ్డాడు. అదే సమయంలో హీరో కమల్ హసన్ రాజకీయ ప్రవేశం చేశాడు. ఎన్నికల వల్ల సినిమాను ముందుగానే కంప్లీట్ చేయాలనుకున్నాడు. కానీ అనివార్య కారణాల వల్లనే కమలహాసన్ సన్నివేశాలు కూడా పూర్తి కాలేదు. చివరగా శంకర్ ఓ నిర్ణయానికి వచ్చేసి ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవాలనుకుంటున్నాడట. దీనికి సంబంధించిన లేఖను నిర్మాణ సంస్థకు కూడా పంపించాడని టాక్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *