కరోనా కట్టడిలో కీలకం

Disaster Response Force

డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ద్వారా హైదరాబాద్ నగరంలో ప్రత్యేకంగా కోవిడ్ సంక్షోభం సందర్భంగా మొత్తం పారిశుద్ధ్య కార్యక్రమాలను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో పూర్తి చేసింది. తన సిబ్బందికి ప్రత్యేకమైన శిక్షణ తోపాటు, ప్రత్యేకమైన వాహనాలను సమకూర్చుకున్న జిహెచ్ఎంసి డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ దేశంలోనే అత్యుత్తమ ప్రమాణాలను నెలకొల్పింది. ఈ సందర్భంగా ఈ విభాగం చేపట్టిన కార్యక్రమాలకు దేశవ్యాప్తంగా ప్రశంసలు లభించాయి. పుట్ పాత్ అక్రమణల ఆక్రమణల తొలగింపు, పార్కులను తిరిగి స్వాధీనం చేసుకోవడం, చెరువుల కాపాడుకోవడం వంటి అనేక కార్యక్రమాలను రెస్పాన్స్ ఫోర్స్ పెద్దఎత్తున చేపట్టింది

కరోనా సంక్షోభం నేపథ్యంలో పురపాలక శాఖ దాని కట్టడి కోసం కీలకమైన చర్యలు తీసుకుంది. లాక్ డౌన్ మొదలైన నాటి నుంచి మున్సిపల్ విభాగం పారిశుద్ధ్యం, విపత్తు సహాయక నిర్వహణ, నీటి సరఫరా వంటి అంశాల విషయంలో 24 గంటల పాటు ప్రణాళికాబద్ధంగా పని చేసింది. దీంతో పాటు సుమారు లక్షా 25 వేల మందికి ఉచిత భోజనాన్ని అందించింది. ముఖ్యంగా వలస కార్మికులకు సంబంధించి వారి వారి సొంత గ్రామాలకు వెళ్లేందుకు ఇతర శాఖలతో పురపాలక శాఖ సమన్వయం చేసుకొని పని చేసింది. వలస కార్మికుల క్యాంపుల్లో కావాల్సిన కనీస వసతుల నిర్వహణకు సైతం దోహదం చేసింది. మరోవైపు ఈ సంక్షోభాన్ని అవకాశంగా వాడుకున్న పురపాలక శాఖ హైదరాబాద్ లాంటి పట్టణాల్లో రోడ్లు, ఫ్లైఓవర్ల నిర్మాణం వంటి ఇంజనీరింగ్ పనులను వేగంగా పూర్తి చేసింది. 60 రోజుల లాక్ డౌన్ కాలంలో సుమారు రెండు వేల కోట్ల రూపాయల విలువైన ఇంజనీరింగ్ పూర్తి చేసింది.

Telangana Corona Updates

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *