వాళ్లు కరుడుగట్టిన నేరస్థులు – సజ్జనార్‌

Disha Accused Are Criminals
దిశ హత్యాచార నిందితులను ఏ పరిస్థితుల్లో ఎన్‌కౌంటర్‌ చేయాల్సి వచ్చిందో సీపీ సజ్జనార్‌ స్పష్టం చేశారు. దిశ వస్తువులను ఎక్కడ దాచారో కనిపెట్టడానికి ​ తీసుకెళ్లినప్పుడు నిందితులు దాడికి తెగ పడ్డారని… రాళ్లతో కొట్టారని ఈ ఘటనలో ఇద్దరు పోలీస్‌లకు గాయాలయ్యాయని తెలిపారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ​ఎన్‌కౌంటర్‌ చేయాల్సి వచ్చిందన్నారు. అంతేకాదు నిందితులు కరడుగట్టిన నేరస్థులనే అనుమాలను వ్యక్తం చేశారు. కర్ణాటక, తెలంగాణా రాష్ట్రాల్లో గతంలో జరిగిన వివిధ ​నేరాల్లో వీరి ప్రమేయంపై అనుమానాలున్నాయని.. ఆ దిశగా కూడా విచారిస్తున్నామన్నారు. దిశ హత్యాచారానికి సంబంధించి తమ ఎంక్వైరీలో నిందితులు అనేక ​విస్తుపోయే విషయాలు వెల్లడించారన్నారు సజ్జనార్‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *