ఏపీ అసెంబ్లీలో పాసైన దిశా చట్టం బిల్లు

Disha Act Passed by Andhra Pradesh

తెలంగాణ రాష్ట్రంలో దిశ ఘటన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనసభ సమావేశాల్లో సంచలన నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం. ఎంతో ప్రతిష్టాత్మకంగా ‘దిశ’ బిల్లును ప్రవేశపెట్టి శాసన సభ ఆమోదం తెలిపింది. బిల్లు పాస్‌ అయినట్లు స్పీకర్‌ తమ్మినేని సీతారాం ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్‌ క్రిమినల్‌ లా చట్టం 2019, ఆంధ్రప్రదేశ్‌ స్పెషల్‌కోర్టు ఫర్‌ స్పెసిఫైడ్‌ అఫెన్సెస్‌ అగైనిస్ట్‌ విమెన్‌ అండ్‌ చిల్ట్రన్‌ యాక్ట్‌ 2019కి ఆమోద ముద్ర వేసింది. ఈ చట్టం ప్రకారం అత్యాచారానికి పాల్పడినట్లు నేరుం రుజువైతే దోషికి మరణశిక్ష విధిస్తారు. కొత్త చట్టం ప్రకారం.. నేరాన్ని నిర్ధారించే ఆధారాలున్నప్పుడు 21 రోజుల్లో తీర్పు వెల్లడిస్తారు. వారంరోజుల్లోనే దర్యాప్తు పూర్తి చేసి.. మరో 14 రోజుల్లో విచారణ పూర్తి చేస్తారు. మొత్తం 21 రోజుల్లో రేప్‌ కేసుపై జడ్జిమెంట్‌ వస్తుంది. నేరస్తులకు శిక్షపడేలా, బాధితులకు సత్వర న్యాయం జరిగేలా ఈ నిర్ణయం తీసుకున్నారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి.

తెలంగాణలో జరిగిన దిశ ఘటన దేశం మొత్తాన్ని కలిచివేసింది. అత్యాచార నిందితులను తక్షణమే శిక్షించాలని అందరూ కోరుకున్నారు. ఇటువంటి తప్పులు జరగకుండా ఉండాలంటే కచ్చితంగా ఏదైనా జరిగితే, భయం ఉంటేనే ఆగుతాయని అంతా భావించారు. ఇదే రకమైన ఒత్తిడి తెలంగాణ ప్రభుత్వంపై కూడా వచ్చింది. ఏదేమైనా ఏపీ ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి మహిళల రక్షణ కోసం తీసుకున్న ఈ సంచలన నిర్ణయం ఏపీ క్యాబినెట్ లో ఆమోదం  పొందింది.

Disha Act Passed by Andhra Pradesh,Andhra Pradesh Assembly passes Disha Bill,ap cabinet,disha act,bill.aseembly accepatance,#DishaMurder,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *