దిశ కేసు నిందితుల ఎన్కౌంటర్ పై  సుప్రీం కోర్టులో పిటీషన్

Disha Case Encounter Reaches Supreme Court

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వెటర్నరీ డాక్టర్ దిశ కేసులో నలుగురు నిందుతులని పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు . కేసు సీన్ రీ కన్స్ట్రక్షన్ కోసం ఘటన స్థలానికి నిందుతులని తీసుకువెళ్ళిన పోలీసులు అక్కడ వారు పోలీసులపై దాడి చేసి గన్స్ లాగేసుకొని ఫైర్ చేయడంతో, ఆత్మరక్షణ కోసం  పోలీసులు వారి పై  జరిపిన కాల్పుల్లో నలుగురు మృతి చెందారు. ఈ ఎన్ కౌంటర్ ని చాలామంది సమర్దించగా ..కొంతమంది ఇలా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవటాన్ని వ్యతిరేకించారు.

ఇకపోతే దిశ నిందుతుల ఎన్కౌంటర్ ఘటన  ప్రస్తుతం సుప్రీంకోర్టుకు చేరింది. ఈ ఎన్కౌంటర్ చేసిన పోలీసులపై కేసు నమోదు చేసి  పూర్తి స్థాయిలో విచారణ జరపాలని జీఎస్ మణి ప్రదీప్ కుమార్ యాదవ్ అనే ఇద్దరు లాయర్లు ఈ పిటిషన్ వేశారు అంతేకాకుండా ఎంపీ జయాబచ్చన్ ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివాల్ లను ప్రతివాదులుగా చేర్చారు. ఈ ఇద్దరూ ఎన్ కౌంటర్ ను సమర్థిస్తూ మాట్లాడారంటూ పిటిషన్ లో పొందుపరిచారు.ఈ పిటిషన్ పై  ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. వెంటనే దర్యాప్తు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో కోరారు.

సుప్రీంకోర్టు 2014లో ఇచ్చిన మార్గదర్శకాలను పోలీసులు పాటించలేదని.. అందుకే చర్యలు తీసుకోవాలని ఇద్దరు లాయర్లు పిటిషన్లో కోరారు. ఇటు మానవహక్కుల సంఘం కూడా ఈ ఎన్కౌంటర్ను సుమోటోగా స్వీకరించింది. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా విచారణకు సిద్ధమయ్యింది.. ఎన్హెచ్ఆర్సీ సభ్యుల టీమ్ హైదరాబాద్ వచ్చింది. అత్యాచార ఘటన జరిగిన తొండుపల్లి.. నిందితుల ఎన్కౌంటర్ జరిగిన స్పాట్లను పరిశీలించి ..నివేదిక అందించనున్నారు.ఇకపోతే ఈ ఎన్ కౌంటర్ లో మరణించిన నిందుతుల మృతదేహాలను మహబూబ్ నగర్  ప్రభుత్వ ఆస్పత్రిలో భద్రపరిచారు .

Disha Case Encounter Reaches Supreme Court,disha murder, disha case, encounter, accused encounter , supreem court , petition ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *