DK aruna comments on kcr
బిజెపి నేత డీకే అరుణ తెలంగాణ సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. దోచుకు తినడం లో కెసిఆర్ దిట్ట అని ఆమె విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో ఓట్ల రాజకీయాల కోసమే ముఖ్యమంత్రికి పథకాలు గుర్తొస్తాయని, కానీ వాటిని అమలు చేయడంలో అడుగడుగున నిర్లక్ష్యం వహిస్తున్నారని బీజేపీ నేత డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను మోసం చేయడమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యంగా కనపడుతుందన్నారు. తెలంగాణ ప్రజలను మోసం చేయడంలో కేసీఆర్ దిట్ట అని విమర్శించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కుమ్మకై జోగులాంబ గద్వాల జిల్లాను దోచుకుతింటున్నారని డీకే అరుణ విమర్శించారు.
tags : DK Aruna, BJP, Jogulamba gadwal district, CM KCR, Telangana