తూచ్.. అది తప్పుడు వార్త

DK Aruna Condemns Social Media News

ఢిల్లీ నుంచి తనకు పిలుపు వచ్చిందని సోషల్ మీడియాలో వస్తున్న వార్త నిజం కాదని.. అసలు తనకు ఎలాంటి పిలుపు ఢిల్లీ  నుంచి రాలేదని డీకే అరుణ వివరణ ఇచ్చారు. ఇలాంటి అబద్దపు వార్తలను ప్రచారం చేయడం కరెక్టు కాదన్నారు. ఇంతకీ, ఆమెపై వచ్చిన వార్త సారాంశం ఏమిటంటే..

తెలంగాణ బీజేపీకి కొత్త సారధిగా, రాష్ట్ర అధ్యక్షురాలిగా డీకే అరుణను నియమించే అవకాశాలు ఉన్నాయి. ఫైర్ బ్రాండ్ నేతగా ఆమెకు గుర్తింపు ఉంది. రాష్ట్రంలో పార్టీ విస్తరణకు చొరవ ఉన్న డీకే అరుణ అయితే బాగుంటుందని బీజేపీ హై కమాండ్ యోచిస్తోంది. అధ్యక్ష పదవీ కట్టబెట్టి పార్టీని క్షేత్రస్థాయిలో బలపరచాలని ఆలోచిస్తోంది. ఈ మేరకు డీకే అరుణకు బీజేపీ హైకమాండ్ సమాచారం అందజేసింది. దీంతో ఆమె హుటహుటిన ఢిల్లీకి పయనమయ్యారు.

అక్కడ బీజేపీ చీఫ్ అమిత్ షా, కార్యనిర్వహక అధ్యక్షుడు జేపీ నడ్డా అరుణకు అధ్యక్ష బాధ్యతకు సంబంధించి సమాచారం అందజేసే అవకాశాలు ఉన్నాయి. డీకే అరుణ నేతృత్వంలో పార్టీ ముందుకెళ్తుందని హై కమాండ్ భావిస్తోంది. అందుకే అధ్యక్ష పదవీకి డైనమిక్ లీడర్‌కి అప్పగిస్తోంది. ఇదిలా ఉంటే మరోవైపు అధ్యక్షుడు లక్ష్మణ్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అసంతృప్తి వెళ్ళగక్కిన మరునాడే డీకే అరుణ పేరు తెరపైకి రావడం విశేషం. మంగళవారం ఓ కార్యక్రమంలో ప్రొటోకాల్ పాటించలేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై కూడా రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ లేదంటే డీకే అరుణను నియమించాలని కోరారు. ఆ మరునాడే అరుణకు హైకమాండ్ నుంచి పిలుపురావడం విశేషం.

Tags : Telangana, BJP, DK Aruna, state president

దేశంలో ఉల్లి దొంగలు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *