ట్వీట్లు కాదు.. నేరుగా మోడీ దగ్గరకు వెళ్ళండి : డీకే అరుణ

DK Aruna Fires On KTR Over Disha Incident

దిశ హత్య ఘటన నేపథ్యంలో బీజేపీ నేత డీకే అరుణ తెలంగాణా సర్కార్ పై మండిపడ్డారు .మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని డీకే అరుణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కీచకులపై జాలి, దయ చూపొద్దని పేర్కొన్నారు.  నిందితులకు కఠిన శిక్ష పడే వరకు ఉద్యమిస్తామని హెచ్చరించారు. ప్రజా ఉద్యమాలతోనే ప్రభుత్వంలో కదలికలు వస్తాయని డీకే అరుణ పేర్కొన్నారు. ఉద్యమం నుంచి ప్రభుత్వ విధానంలో మార్పు వస్తుందని తెలిపారు. ట్వీట్లు కాదు చెయ్యాల్సింది అన్న డీకే అరుణ  పనిలో పనిగా మంత్రి కేటీఆర్‌పై డీకే అరుణ విమర్శలు గుప్పించారు. సమస్యకు సంబంధించి ట్వీట్లు చేయడం కాదని సూచించారు. సమస్యను ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి నేరుగా తీసుకెళ్లాలని కోరారు.

ట్వీట్ చేసి చేతులు దులుపుకోవడం మంచి పద్ధతి కాదన్నారు.  దిశ ఘటన జరిగిన ఐదు రోజులకు సీఎం కేసీఆర్ స్పందించారని ఫైర్ అయ్యారు. నిందితులకు త్వరతిగతిన శిక్ష విధించాలని సూచించారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు కూడా తీర్పును ఆలస్యం చేస్తున్నాయని డీకే అరుణ అభిప్రాయపడ్డారు. ఘటన జరిగినా నెలరోజుల్లోనే శిక్షపడేలా చూడాలని కోరారు. దీంతో బాధిత కుటుంబాల్లో ఆత్మస్థైరం పెరుగుతుందన్నారు. అదే సమయంలో నీచానికి ఒడిగట్టేవారిలో కూడా మార్పొస్తుందని చెప్పారు.  హత్యపై కేసీఆర్ రియాక్ట్ కావడం లేదని సర్వత్రా విమర్శలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. దీంతో ఆయన ఆదివారం రాత్రి ప్రకటన చేశారు. అయితే గవర్నర్, కేంద్రమంత్రులు.. దిశ కుటుంబసభ్యులను పరామర్శిస్తే.. సీఎం కేసీఆర్‌కు సమయం లేదా అని ప్రశ్నిస్తున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నారు. నిరసనలు దిశ ఘటనపై తెలుగురాష్ట్రాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. వి వాంట్ జస్టిస్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. జస్టిస్ దిశ అంటూ పలువురు ఆందోళన  చేస్తున్నారు. దిశకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరిస్తున్నారు.
DK Aruna Fires On KTR Over Disha Incident,disha murder, bjp, DK aruna , cm kcr, ktr , modi , twitter, tweets,Priyanka Reddy,Doctor Priyanka Reddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *