బీజేపీలోకి డీకే అరుణ

DK ARUNA JOINS IN BJP

  • అమిత్ షా సమక్షంలో పార్టీలో చేరిక
  • మహబూబ్ నగర్ స్థానం నుంచి పోటీ

లోక్ సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి డీకే అరుణ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. మంగళవారం ఉదయం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ ఆమె నివాసానికి వెళ్లి చర్చలు జరిపారు. అనంతరం ఫోన్ లో అమిత్  షాతో మాట్లాడించారు. తర్వాత అరుణ ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. అర్థరాత్రి 1.30 గంటల సమయం వరకు మాట్లాడిన అనంతరం బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో కాషాయం పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ ఎన్నికల్లో అరుణ మహబూబ్ నగర్ స్థానం నుంచి బరిలోకి దిగనున్నారు. మరోవైపు టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి కూడా బీజేపీలో చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై బుధవారం స్పష్టత రానుంది.

TS POLITICS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *