జగన్ కు ఆరునెలల సమయం అనవసరం అన్న చంద్రబాబు

Spread the love
Does Jagan Required 6 months time Said Chandrababu

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి మొదట ఆరు నెలలు సమయం ఇద్దామని టిడిపి భావించింది. కానీ టిడిపి అధినేత కూడా పార్టీ నాయకులతో ఇదే విషయాన్ని చెప్పారు. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో జగన్ కు అంత సమయం ఇవ్వడం అనవసరం అనిపిస్తుంది అని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. టిడిపి ఎమ్మెల్సీల సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు నాయుడు అసెంబ్లీ వేదికగా వైసీపీని నిలదీయాలని ఆయన పేర్కొన్నారు.

బెదిరించే ధోరణిలో ప్రస్తుత ప్రభుత్వం పని చేస్తుందని ఇక అలాంటి సమయంలో అటువంటి ప్రభుత్వానికి ఆరు నెలల సమయం అవసరమని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెర అసెంబ్లీ సమావేశాలకు ముందు కీలక వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు టిడిపి కార్యకర్తల పైన దాడులు పెరుగుతున్నాయని, బెదిరింపులు ఎక్కువవుతున్నాయని అందుకే వైసిపికి ఆరునెలల సమయం ఇవ్వడం అనవసరం అని పేర్కొన్నారు. టిడిపి కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టే కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని, అణచివేత ధోరణి లో ప్రస్తుతం పాలక ప్రభుత్వం పని చేస్తుందని కనుక ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. టిడిపి కార్యకర్తలపై దాడులు సహించబోమని స్పష్టం చేసిన చంద్రబాబు సంఘీభావ ర్యాలీలతో టీడీపీ కార్యకర్తలకు అండగా నిలవాలని, ధైర్యం ఇవ్వాలని సూచించారు. ఇక అలాగే శాసనమండలిలో పార్టీకి బలం బాగానే ఉందని, ప్రజా సమస్యలపై గట్టిగా పోరాడాలని ఆయన తెలిపారు టిడిపి నేతల పై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని, ధీటుగా సమాధానం చెప్పాలని, అందరూ దీటుగా ఎదుర్కోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఇక ప్రభుత్వం జారీచేసే అన్ని జీవోలను క్షుణ్ణంగా పరిశీలించి నిర్మాణాత్మకమైన విమర్శలు చేయాలంటూ చంద్రబాబు చెప్పారు. టిడిపి నేతలకు దిశానిర్దేశం చేసిన చంద్రబాబు ఇక నుంచి అసెంబ్లీ వేదికగా నిలదీస్తాం అంటూ తమ నిర్ణయాన్ని ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *