ఉద్యోగాలు ఇప్పిస్తామంటే గుడ్డిగా నమ్మకండి

Dont Believe Brokers For Linemen Jobs

దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ 2500 జూనియర్ లైన్ మన్, 500 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ మరియు 25 జూనియర్ పర్సనల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సెప్టెంబర్, 29, 2019 న మూడు నోటిఫికేషన్లు జారీ చేసింది. భర్తీకి సంబందించిన ప్రక్రియ వివిధ స్థాయిల్లో నున్నది. షెడ్యూల్ ప్రకారం వ్రాత పరీక్షలు నిర్వహించటానికి సంస్థ తగు చర్యలు తీసుకుంటున్నది.

ఈ సంస్థ చేపట్టిన పై నియామకాలు వ్రాత పరీక్షలో అభ్యర్థులకు వచ్చిన మార్కుల ఆధారంగానే జరుగుతాయి. కానీ కొందరు దళారులు పై ఉద్యోగాలను ఇప్పిస్తామని డబ్బు వసూలు చేస్తూ నిరుద్యోగులను మోసం చేస్తున్నారని సంస్థకు అందిన సమాచారం ఆధారంగా సంస్థ విజిలెన్సు విభాగం విచారణ చేయగా, గతంలో విద్యుత్ శాఖలో Addl. AE గా పని చేసి రిటైర్ అయిన గోకుల్ శ్యాం సుందర్ S/o గోపాల్ రావు ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగుల నుండి డబ్బు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. ఇతను వ్రాత పరీక్షలో మార్కులు వేయించి ఉద్యోగాలు వచ్చేటట్లు చేస్తానని చెప్పుకుంటూ, కొంతమంది ఉద్యోగార్థుల నుండి ఒకొక్క ఉద్యోగానికి గాను రూ. మూడు లక్షలకు మాట్లాడుకుని, ముందుగా ఒక లక్ష రూపాయలు, ఉద్యోగ ఉత్తర్వులు వచ్చిన తరువాత మిగతా రెండు లక్షలు ఇచ్చేటట్లు ఒప్పందం చేసుకున్నాడు. ఈ విషయం లో సంస్థ విజిలెన్సు విభాగం వారు సంబంధిత సైఫాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా గోకుల్ శ్యాం సుందర్ పై నేరం సంఖ్య 668/2019 u /s 420 IPC క్రింద కేసు నమోదు చేయడమైనది.

సంస్థ విజిలెన్సు అధికారులు మరియు పోలీసులు కలిసి ఉద్యోగార్ధుల రూపం లో పధకం ప్రకారం వలపన్ని గోకుల్ శ్యాం సుందర్ ను సంప్రదించి అతడు ఒప్పందం కోసం రాగా పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

అతనిని విచారించగా తెలిసినది ఏమనగా కేవలం అభ్యర్థులను మభ్య పెట్టి డబ్బులు వసూలు చేసుకున్న తరవాత అందులో ఎవరైనా స్వయం కృషి తో వుద్యోగం పొందితే తానే అట్టి వుద్యోగం ఇప్పించానని ఒప్పందం ప్రకారం మొత్తం డబ్బు తీసుకుని, వుద్యోగం రాని అభ్యర్థులకు అడ్వాన్సుగా తీసుకున్న డబ్బు తిరిగి ఇస్తాడని తెలిసింది. అంతేగాని అతను దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ అధికారులకు గాని, మరి ఏ ఇతర అధికారులను గాని సంప్రదించలేదు మరియు అది సాధ్యం కాదు.

కావున సామాన్య ప్రజలకు మరియు ముఖ్యంగా ఉద్యోగార్థులైన అభ్యర్థులకు తెలియజేయునది ఏమనగా ఈ సంస్థలో నిర్వహించు నియామక ప్రక్రియ పారదర్శకంగా నిర్వహిస్తున్నందున, అర్హత పరీక్షలో ని ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాలు దక్కుతాయి. అభ్యర్థులు గోకుల్ శ్యాం సుందర్ వంటి దళారులను నమ్మి మోసపోవద్దని కష్టపడి చదివి అర్హత పరీక్షల్లో తమ ప్రతిభ చాటుకుని మాత్రమే ఉద్యోగాలు పొందగలరు. ఒక వేళ ఎవరైన అభ్యర్థులు ఇలాంటి దళారులను అశ్రయించినట్టు పరీక్షకు ముందే తెలిస్తే అట్టి అభ్యర్థులను వ్రాత పరీక్షకు హాజరు కానివ్వడం జరగదు. ఒక వేళ ఉద్యోగం వచ్చిన తరవాత తెలిస్తే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు.

ఎవరైనా దళారులు, పై ఉద్యోగాలు ఇప్పిస్తామని అభ్యర్థులను సంప్రదించినట్లైతే ఆ సమాచారాన్ని విజిలెన్సు విభాగానికి 040-23431143 / 9440813884 / 9440812984 నకు ఫోన్ చేసి తెలియజేయాల్సిందిగా సంస్థ చీఫ్ విజిలెన్సు అధికారి శ్రీ కొండారి మురళీధర్ రావు గారు కోరారు.

Dont Believe Brokers For Linemen Jobs,Don’t Entertain Brokers In Electricity Jobs,Dont Depend On Brokers For Electricity Jobs,FakeJobs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *