Bjp Leader Swamy Supported YS Jagan
క్రిస్టియన్ అయినంత మాత్రాన జగన్ మీద, ఆయన ప్రభుత్వంపై బురద జల్లడం మంచిది కాదని, జగన్ విశ్వసనీయత కలిగిన వ్యక్తి అని, చెప్పింది చేసే సూటిగా మాట్లాడే మనస్తత్వం ఉన్న వ్యక్తి అని కేంద్ర మాజీ మంత్రి ఫైర్ బ్రాండ్ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి తెలిపారు. ఢిల్లీలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ఈ రాజకీయాలు మానుకోవాలని హితువు పలికారు. తిరుమల ఆస్తుల అమ్మకం పై టీడీపీ, బీజేపీలు కలిసి రాజకీయాలు చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. దేవుడిపైన అబద్ధాలు చెప్ప రాదని, రాజకీయాల్లో నిజాయితీ ముఖ్యమన్నారు. అబద్ధాలు చెబితే దొరికిపోక తప్పదన్నారు. 2016లో టీడీపీ, బీజేపీలు కలిపి ఆస్తులు అమ్మాలని నిర్ణయం తీసుకున్నాయని తెలిపారు. బిజెపి నాయకుడు భాను ప్రకాష్ రెడ్డి ఆ కమిటీలో సభ్యుడిగా ఉన్నారని, బిజెపి నాయకుడు దేవాదాయ శాఖకు మంత్రిగా ఉన్నారని గుర్తు చేశారు. చంద్రబాబు హయాంలోనే ఈ నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. కాబట్టి, ఇప్పటికైనా చంద్రబాబు, బీజేపీ నేతలు క్షమాపలు చెప్పాలన్నారు. టీటీడీ ఆస్తుల అమ్మకం తీర్మానాన్ని నిలుపుదల చేస్తూ తీసుకున్న నిర్ణయం పై జగన్ కు ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. ఇందుకు సంబంధించి ఉపవాస దీక్షలు చేయడం హాస్యాస్పదమన్నారు. తిరుమల ఆస్తులను అమ్మకుండా వాటిని ఇతర కార్యక్రమాలకు ఉపయోగించాలని సూచించారు. జగన్ ప్రభుత్వానికి తాను సలహాలు పంపిస్తానని తెలిపారు.