గెలుపు ఆయనదే

DON’T PANIC ON TDP VICTORY

  • టీడీపీ శ్రేణులు భయపడొద్దు
  • ఎన్నికలు పూర్తి ఏకపక్షంగా జరిగాయి
  • నటుడు శివాజీ వీడియో విడుదల

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు పూర్తి ఏకపక్షంగా జరిగాయని, గెలుపు విషయంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని నటుడు శివాజీ సూచించారు. ఈ విషయంలో అనవసరంగా బీపీ పెంచుకోకుండా ఎవరి పనులు వారు చేసుకుంటూ నిశ్చింతగా ఉండాలని పేర్కొన్నారు. ఏపీలో ఎన్నికలు ముగిసిన రెండు రోజుల తర్వాత ఆయన పోలింగ్ సరళిపై స్పందిస్తూ.. ఓ వీడియో విడుదల చేశారు. ఎన్నికల ఫలితా విషయంలో బీజేపీ కొత్త డ్రామాకు తెరతీసిందని దుయ్యబట్టారు. పీఏఆర్సీ అనే పేపర్ పై ఇవే ఫలితాలు అంటూ అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని శివాజీ విమర్శించారు. ‘‘బీజేపీ కొత్తగా మరో డ్రామాకు తెరతీసింది. దాని ప్రకారం తొలి దశ ఎన్నికల్లో ఎన్టీఏకు 39, కేసీఆర్ నేతృత్వంలోని ఫెడరల్ ఫ్రంట్ కు 33 సీట్లు వస్తాయని చెబుతోంది. అంటే టీఆర్ఎస్ కు 16 సీట్లు, వైఎస్సార్ సీపీకి 17 ఎంపీ సీట్లు వస్తాయని ప్రచారం చేస్తున్నారు. అంటే తమకు 72 సీట్లు వస్తాయని ప్రచారం చేస్తున్నారు. వాటిని ఎవరూ నమ్మవద్దు. బీజేపీ తన రాజకీయాల కోసం ఏపీని కూడా వాడుకోవాలని చూస్తంది. కానీ ఇక్కడ అంత సినిమా లేదు. తీర్పు మొత్తం ఏకపక్షంగా ఉంది. ఏపీలో మళ్లీ ప్రజాప్రభుత్వం ఏర్పడబోతోంది’’ అని వ్యాఖ్యానించారు.

ఏపీ ఎన్నికల్లో రెండే అంశాలున్నాయని.. చంద్రబాబుని ఓడించడానికి మహిళలంతా అర్ధరాత్రి వరకు రోడ్డుపై ఉండి జగన్ కు ఓటేయాలి. లేదా జగన్ రాకపోతే మా బిడ్దల భవిష్యత్తు ఏమైపోతుందో అని భయంతో మహిళలు, వృద్ధులు అందరూ ఏకమై జగన్ కు ఓటేయాలి. ఈ రెండే కారణాలతో జగన్ గెలవాలి. లేకపోతే పూర్తి మెజార్టీతో చంద్రబాబు గెలుస్తారు అని శివాజీ పేర్కొన్నారు. ఏపీ ప్రజలు పూర్తి ఏకపక్షంగా తీర్పు ఇచ్చేశారని, గెలుపు కచ్చితంగా చంద్రబాబుదేనని, ఈ విషయంలో టీడీపీ శ్రేణులు ఎలాంటి ఆందోళనా చెందొద్దని సూచించారు. తెలుగుదేశం పార్టీ నేతలు కూడా బాబు వ్యూహాన్ని గమనించలేక భయపడిపోతున్నారని, కానీ ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని స్పష్టంచేశారు. మే 23న వెలువడబోయే తీర్పు అనూహ్యంగా ఉండబోతోందన్నారు. అందువల్ల అందరూ అనవసరంగా ఆందోళన చెంది, బీపీ తెచ్చుకోవద్దని.. ఎవరి పనులు వారు చేసుకుంటూ హ్యపీగా సమ్మర్ ఎంజాయ్ చేయాలని శివాజీ సూచించారు.

AP POLITICS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *