ఉద్యోగుల తొలగింపు ఆందోళనకరమన్న పవన్ కళ్యాణ్

Spread the love

Don’t Remove RTC Employees

పవన్ కళ్యాణ్ ఎంత మంచి మాట అన్నారు. ఉద్యమంలో పోరాటం చేసిన ఉద్యోగులను తొలగిస్తానంటే ఎలా అంటూ మనసులో మాట చెప్పకనే చెప్పాడు. ఆర్టీసీ ఉద్యోగుల తొలగింపు ఆందోళనరమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యోగులు చేసే ఆందోళనలను ప్రభుత్వం సానుభూతితో అర్థం చేసుకుని పరిశీలించాలే తప్ప కఠినమైన నిర్ణయాల్ని తీసుకోకూడదని పవన్ కళ్యాణ్ రాష్ట్ర ముఖ్యమంత్రికి హితువు పలికారు. తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన సమ్మె సందర్భంగా 48,660 మంది ఉద్యోగుల్లో 1200 మంది తప్ప మిగతా వారందరినీ ఉద్యోగాల నుంచి తొలగించనున్నట్లు వస్తున్న వార్తలు కలవరానికి గురి చేస్తున్నాయని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశాడు. తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మె చేసి ఉద్యమానికి అండగా ఉన్నారని, ఈ సందర్భంగా వారు చేసిన త్యాగాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అటు ప్రభుత్వం ఇటు ఉద్యోగ సంఘాలు సంయమనం పాటించి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ఉభయులకు ఆయన విజ్నప్తి చేశారు. చర్చల ద్వారా పరిష్కారమైన అనేక సమస్యలను చూశామని, ప్రజలకు కష్టం కలగకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఉద్యోగుల పట్ల ఉదారణ చూపాలని, తెలంగాణలో ఆర్టీసీ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుని ఆయన కోరారు. మరి, కేసీఆర్ పవన్ కళ్యాణ్ మాట అయినా వింటాడని ఆశిద్దాం.

Telangana Political Updates

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *