దివాలా తీసిన డీక్యూ ఎంటటైన్మెంట్

DQ Filed IP

హైదరాబాదులో డీక్యూ ఎంటటైన్మెంట్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ కంపెనీ (అనిమేషన్) బిచానా ఎత్తివేసింది. కంపెనీ దివాలా తీసిందని ట్రిబ్యునల్లో పిటీష‌న్ దాఖ‌లు చేసింది. దీంతో, 1400 మంది ఉద్యోగులు రోడ్డున ప‌డ్డారు. డీక్యూ గత ఎనిమిది నెలల నుంచి ఉద్యోగులకు జీతాలు చెల్లించడం లేదు. తమకు న్యాయం చేయాలంటూ పోలీసులు, మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించిన ఉద్యోగులు. సంస్థ ఎండీపై సీసీఎస్ లో ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. సంస్థ ఎండి తపాస్ చక్రవర్తిపై చర్యలు తీసుకొని… తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు ఒక్కొక్కరికి 14లక్షలు రావాలని ఉద్యోగులు తెలిపారు. తమ వేతనాలు అడిగితే వేధింపులకు, బెదిరింపులకు పాలుపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *