Dr Ravikumar Is Bjp Candidate
నాగార్జునసాగర్ ఉపఎన్నిక బీజేపీ అభ్యర్థిగా డా. రవికుమార్ నాయక్ ను ఎంపిక చేశారు. ఈ మేరకు పానుగోతు నాగార్జునసాగర్ అసెంబ్లీ అభ్యర్థిపై బీజేపీ అధిష్టానం ఒక ప్రకటన వెలువరించింది. జనరల్ కేటగిరిలో ఎస్టీ అయిన రవికుమార్‌కు సీటు కేటాయించారు. పలు ఆస్పత్రుల్లో సివిల్ సర్జన్‌గా రవికుమార్ పని చేశారు. రవికుమార్ మంగళవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఏప్రిల్ 17న నాగార్జునసాగర్ ఉపఎన్నిక జరగనుంది. కాంగ్రెస్ అభ్యర్థిగా జానా రెడ్డి, టీఆర్ఎస్ తరపున నోముల నర్సింహయ్య తనయుడు భగత్ ఉపఎన్నికల బరిలో ఉన్నారు. ఇప్పటికే నాగార్జున సాగర్‌లో ఎన్నికల వేడి రాజుకుంది.
ఎవరీ రవికుమార్?
పూర్తి పేరు : ఫాను గోతు రవికుమార్
స్వగ్రామం: పలుగు తండ త్రిపురారం మండలం
పుట్టిన తేదీ: 09-06-1985
భార్య: పానుగోతు సంతోషి
తల్లిదండ్రులు: పానుగోతు హరి, పానుగోతు దస్సి
పిల్లలు: మన స్వీత్, వీనస్
విద్యార్హతలు: ఎం బి బి ఎస్
వృత్తి: ప్రభుత్వ వైద్యుడు
( ప్రస్తుతం రాజీనామా )
పలు ఆస్పత్రులలో సివిల్ సర్జన్ గా ఉద్యోగ బాధ్యతలు.
నిర్మల ఫౌండేషన్ చైర్మన్, పలు మండలాలలో సామాజిక కార్యక్రమాలు నిర్వహణ.