గుంటూరు డ్రగ్స్ తయారీ  ముఠా గుట్టు రట్టు

Drugs Racket At Guntur

ఏపీ మాదక ద్రవ్యాల తయారీకి అడ్డాగా మారుతుంది. తాజాగా వెలుగు చూస్తున్న ఘటనలు అందుకు సాక్ష్యంగా మారాయి. గుంటూరు డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠా గుట్టురట్టయింది. స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీలో డ్రగ్స్ తయారు చేస్తున్న మహ్మద్ షాద్ ను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా నల్లపాడు పోలీసులు మాట్లాడుతూ, డ్రగ్స్ తయారు చేసి విద్యార్థులకు విక్రయిస్తుండేవాడని పోలీసుల సమాచారం. ఈ వ్యవహారానికి సంబంధించి సౌత్ యెమెన్ కు చెందిన మహ్మద్ షాద్, సిరియాకు చెందిన మహ్మద్ రఫత్ తో పాటు గుంటూరుకు చెందిన నాగూర్ షరీఫ్, వెంకటసూర్య, పాలెం అవినాశ్ లను అరెస్టు చేసిన్టు పోలీసులు తెలిపారు. డ్రగ్స్ తయారు చేసే పరికరాలు, గంజాయి, సింథటిక్ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. గుంటూరు అర్బన్ ఎస్పీ రామకృష్ణ మాట్లాడుతూ, ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఇద్దరు నిందితులు జైల్లో వున్నారని చెప్పారు. విద్యార్థులు, యువత తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని సూచించారు.

Drugs Racket At Guntur,guntur, drugs, gang arrest , marijuana, synthetic drugs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *