DS Fired On Trs Party
ఎన్నికలు సుమారు 50 సంవత్సరాల నుంచి ఈ రకమైన ఎన్నికలు జరుగలేదని టీఆర్ఎస్ నేత డి.శ్రీనివాస్ అన్నారు. హైదరాబాద్ అతలాకుతలమై, వందలాది మంది ఇబ్బందులు పడుతుంటే ఫ్యామిలీ కి 10 వేలు ఇస్తా అన్నప్పుడు ఇంత అర్జంట్ గా పెట్టాల్సిన అవసరం ఏమి ఉందని నిలదీశారు. ఎన్నికల కమిషన్ ఎప్పుడూ అయినా ఎన్నికల్ని ఆపమని చెప్పొచ్చని జోస్యం పలికారు. పైసలు ఇవ్వకుండా ఓట్లు వేయమంటున్నారు.. ఎన్నికల అయ్యాక డబ్బులు ఇస్తారా అని ప్రశ్నించారు. టీఆరెస్ పని చేస్తే సంతోషం.. అసలు పని చేస్తే ప్రజలలో ఎందుకు వ్యతిరేకత వాస్తదని ప్రశ్నించారు.
టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికైనా క్రెడిబిలిటీ పెంచుకోవాలని హితువు పలికారు. టీఆరెస్ నేతలు కథలు చెప్పి ఓట్లు అడుగుతున్నారని దుయ్యబట్టారు. అధికారం లోకి వచ్చి ఆరు సంవత్సరాలైంది.. రోడ్లు ఎక్కడ మంచిగా చేశారో చూపెట్టాలన్నారు. ఎన్నికల్ని జిమ్మిక్ గా చేయవద్దని సూచించారు. మొన్న నోటిఫికేషన్ ఇచ్చి నామినేషన్లు రేపట్నుంచి అంటే ఎలా? ఇది కరెక్టు పద్ధతి కానే కాదన్నారు. ప్రజా స్వామ్య బద్దంగా పద్ధతి ప్రకారం ఎన్నికలు జరగాలన్నారు. రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలని సూచించారు.
కేసీఆర్ యుద్ధం చేస్తా అనడం తనకు అర్ధం కాలేదన్నారు. రాష్ట్రాల పరిస్థితులు, మ్యానిఫెస్టోను బట్టి రాజయీక పార్టీలు నడుచుకుంటాయి. ఇలా జనానికి విరక్తి పుట్టేలా చేయకూడదన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు నియోజకవర్గాలకు ఆనుకుని ఉన్న దుబ్బాక నియోజకవర్గంలో ప్రజల నిర్ణయం చూశాం కదా. ఎందుకో గానీ కేసీఆర్ రాష్ట్రం కంటే కేంద్రం గూర్చే ఆలోచన చేస్తాడన్నారు. కేసీఆర్ యుద్ధం అని మాట్లాడటం కరెక్ట్ కాదన్నారు.
68 వేల కోట్ల రూపాయలతో చేసిన అభివృద్ధి ఎక్కడ కనిపిస్తుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయంలో ఫ్లై ఓవర్ల నిర్మాణం చేశారు..ఇప్పుడు వాటిని మెయింటెయిన్ చేస్తున్నారంతే అని అన్నారు. హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేస్తామని కమిట్మెంట్ ఇచ్చే వారికి ఓటు వేయాలన్నారు. అయినా ఎవరికి ఓటు వేయాలో ప్రజలకు తెలుసన్నారు. ఈసారి జీహెచ్ఎంసీ ఎన్నికలు జిమ్మిక్కుగా ఉన్నాయన్నారు. షెడ్యుల్ లేకుండానే నోటిఫికేషన్ వచ్చిందని టీఆర్ఎస్ 150 సీట్లు గెలిచిన ఆశ్చర్యం లేదన్నారు.