Dubbaka Assembply by pole
టీఆర్ఎస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి అకాల మరణంతో దుబ్బాక ఉప ఎన్నిక అనివార్యమైంది. ఉప ఎన్నికకు షెడ్యూల్ రిలీజ్ చేయడంతో ఈరోజు నుంచే దుబ్బాక నియోజక వర్గంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. తెలంగాణలోని మెదక్ జిల్లాలోని దుబ్బాక అసెంబ్లీ నియోజక వర్గం ఉప ఎన్నికకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇప్పటికే ఎన్నికల బరిలోకి దిగేందుకు ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ సిద్ధమయ్యాయి. అభ్యర్థుల వేటలో నేతలు నిమగ్నమయ్యారు. మరోవైపు ప్రచారం హోరెత్తుతోంది. తాజాగా నోటిఫికేషన్ రావడంతో మరింత దూకుడుగా ముందుకు వెళ్లనున్నారు.
షెడ్యూల్ వివరాలు..
నామినేషన్ల దాఖలు ప్రారంభం: అక్టోబర్ 9
నామినేషన్ల చివరి తేదీ : అక్టోబర్ 16
నామినేషన్ల పరిశీలన : అక్టోబర్ 17
ఉపసంహరణ చివరి తేదీ: అక్టోబర్ 19
పోలింగ్ తేదీ : నవంబర్ 3
కౌంటింగ్ తేదీ నవంబర్: 10