దుబ్బాకలో కరోనా లేదా?

3
Dubbaka bypole elections
Dubbaka bypole elections

Dubbaka bypole elections

దుబ్బాక ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడగానే ప్రధాన రాజకీయ పార్టీలు రంగంలోకి దిగాయి. గెలుపే లక్ష్యంగా ఇంటింటి ప్రచారం చేస్తున్నాయి. ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎడాపెడా ర్యాలీలు, ప్రచారాలు చేస్తున్నారు. కరోనా నివారణకు సోషల్ డిస్టెన్స్ పాటించాలన్నా టీఆర్ఎస్ ప్రభుత్వమే నిబంధనలను తుంగలో తొక్కింది. టీఆర్ఎస్ ర్యాలీలో, ప్రచారంలో నాయకులుకానీ, కార్యకర్తలుకానీ మాస్కులు పెట్టుకోవడం లేదు. సోషల్ డిస్టెన్స్ కూడా పాటించడం లేదు. దుబ్బాక కరోనా ఉండదా? అని జనాలు విమర్షిస్తున్నారు.