సీఎం కేసీఆర్ కు షాక్ ఇచ్చిన ఈసీ

EC gave shock to CM KCR

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. మార్చి 17న కరీంనగర్ లో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ హిందువుల పట్ల అవమానకర రీతిలో మాట్లాడారంటూ విశ్వహిందూ పరిషత్, వీహెచ్‌పీ తెలంగాణ విభాగం అధ్యక్షుడు రామరాజు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. కేసీఆర్ వ్యాఖ్యలు ఎన్నికల నియమావళికి విరుద్ధమని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. రామరాజు ఫిర్యాదును పరిశీలించిన ఈసీ ఆ మేరకు చర్యలు తీసుకుంది. కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలు ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందకు వస్తాయని ఈసీ తెలిపింది. ఏప్రిల్ 12లోపు వివరణ ఇవ్వాలని కేసీఆర్‌కు ఈసీ ఆదేశాలు జారీ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *