Education Compulsory
దేశంలో మూడేళ్ల నుంచి 18 ఏళ్ల వరకు ప్రతి ఒక్కరికి విద్య తప్పనిసరి అని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు నూతన విద్యా విధానానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కరికులమ్ భారం తగ్గించాలనేది నూతన విద్యా విధానం ఉద్దేశమని కేంద్రం వెల్లడించింది. బహుభాషల బోధన దిశగా నూతన విద్యా విధానం ఉంటుందని వివరించింది. డిప్లొమా రెండేళ్లు, వృత్తివిద్య కోర్సు ఏడాదిగా కేంద్రం నిర్ణయించింది విద్యా విధానంలో 34 ఏళ్లుగా ఎలాంటి మార్పులు చేయలేదని కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్ తెలిపారు. ఉన్నత విద్యలో అనేక సంస్కరణలు తెస్తున్నామని జావడేకర్ వెల్లడించారు.