విశాఖలో గ్యాస్ లీక్.. 8 మంది మృతి

eight dead in vizag gas leak

విశాఖ ఆర్‌.ఆర్‌ వెంకటాపురం గ్యాస్ లీక్‌ ప్రమాదంలో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. విశాఖ లో పరిస్థితి సీరియస్ ఉన్నది. ప్రజలు రోడ్డు మీదే పడిపోయారు.  ఎల్‌జీ పాలిమర్స్‌ పరిశ్రమ నుంచి రసాయన గ్యాస్‌ లీక్‌ కావడంతో పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని అంబులెన్సుల ద్వారా ఆసుపత్రులకు తరలించారు. ఇప్పటికే సీఎం జగన్‌ సంఘటనపై ఆరా తీసి సహాయ చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మధ్యాహ్నం విశాఖకు చేరుకుని బాధిత కుటుంబాలను సీఎం జగన్‌ పరామర్శించనున్నారు. విశాఖ గ్యాస్‌ లీక్‌ ఘటనపై కేంద్ర హోంశాఖ ఆరా తీసింది.

పాలిమర్స్ ఘటనలో దాదాపుగా అదుపులోకి వచ్చిన పరిస్థితి. కేజీహెచ్, గోపాలపట్నం, పెందుర్తి ఆస్పత్రి తో పాటు ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు నాయుడు తోట వేపగుంట పురుషోత్తపురం పరిసర ప్రాంతాల్లో నెలకొన్న సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని తెలిసింది. వెంకటాపురం వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
మృతుల సంఖ్యపై వదంతులు నమ్మవద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. అధికారికంగా ముగ్గురు మాత్రమే మృతి చెందారని, అనధికారికంగా ఎనిమిది మంది వరకు ఉండవచ్చని స్థానికులు అంటున్నారు.

#vizaggasleak

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *