మEkor Startup
అగ్గిపెట్టెలో ఇమిడే చీరను నేసి ప్రపంచానికి చేనేత కళా వైభవాన్ని చాటి చెప్పిన ఘనత మన చేనేత కార్మికులది. చేనేత రంగంలో ఎంతో ఖ్యాతి గడించినా.. నేటికీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుంది. గిట్టుబాటు లేక బతుకు చిరిగిన వస్ర్తమైంది. మగ్గాలు మరణశయ్యపై ఉన్నాయి. చేనేత తాళ్లూ ఉరితాళ్లయ్యాయి. ఈ సమస్యలన్నింటిని చాలా దగ్గరగా చూసింది ఈకోర్ స్టార్టప్. చేనేత కార్మికుల్లో వెలుగులు నింపడమే ధ్యేయంగా ఏర్పాటైంది.
చేనేత కార్మికులకు చేతినిండా పని కల్పించినా… పొట్ట నిండదు. కారణం దళారుల జోక్యం. చేనేత కార్మికుల నుంచి కస్టమర్లకు నేరుగా చేనేత బ్రాండ్ అందేలా చేయడమే ఈకోర్ ఉద్దేశం. ఇందుకోసం హైదరాబాద్ అమీర్ పేట లో స్టార్టప్ స్టార్ట్ చేసింది. చేనేత ఒక బ్రాండ్ మలిచేందుకు స్నేహరెడ్డి కొనకటి, సాయి, సుచరిత, నరేంద్ర, సుమ, మరికొంతమంది టీం గా ఏర్పడ్డారు. కొత్త కొత్త డిజైన్స్ చేనేత కార్మికులతో తయారుచేస్తూ మార్కెటింగ్ చేస్తోంది ఈ స్టార్టప్. సామాన్యుల నుంచి సెలబ్రిటీ వరకు చేనేత దుస్తులు ధరించేలా ఈకోర్ ఫొటోగ్రఫీ చేస్తూ చేనేతకు పూర్వవైభవం తీసుకొస్తోంది. చేనేత బ్రాండ్ ను ప్రజల్లోకి తీసుకెళ్లి కార్మికుల పొట్ట నింపడమే లక్ష్యం అంటోంది.