తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నోటిఫికేషన్

ELECTION NOTIFICATION

  • నామినేషన్ల స్వీకరణ ప్రారంభం

ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టానికి తెరలేచింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీతోపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నిల నోటిఫికేషన్‌ విడుదలైంది. తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాల ఎన్నికల నోటిఫికేషన్ ను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌ సోమవారం విడుదల చేశారు. అటు ఆంధ్రప్రదేశ్‌లో ఆ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేది కూడా నోటిఫికేషన్‌ విడుదల చేశారు. 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు నోటిఫికేషన్‌ వెలువడింది. అనంతరం జిల్లాల వారీగా నోటిఫికేషన్లను కలెక్టర్లు విడుదల చేశారు. నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభమైంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈనెల 21న హోలీ, 24 ఆదివారం.. సెలవు దినాలు కావడంతో ఆ రెండురోజులూ నామినేషన్ల స్వీకరణ ఉండదు. నామినేషన్ల స్వీకరణకు గడువు ఈ నెల 25తో ముగియనుంది. 26న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 27 నుంచి 28 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇస్తారు. ఏప్రిల్‌ 11న పోలింగ్‌ జరగనుండగా.. మే 23న ఓట్ల లెక్కింపు చేపట్టి, ఫలితాలు విడుదల చేస్తారు.

GENERAL NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *