ఎన్నికల కోడ్ ఉండగానే స్థానిక సంస్థల ఎన్నికలు

Elections Code and Local Election

తెలంగాణా రాష్ట్రంలో ఎన్నికల జాతర కొనసాగుతుంది. అసెంబ్లీ ఎన్నికలు పూర్తి కాగానే పంచాయితీ ఎన్నికలు, ఆపై ఎమ్మెల్సీ ఎన్నికలు, వెనువెంటనే లోక్ సభ ఎన్నికలు జరిగాయి. ఇక తరువాత స్థానిక సంస్థల ఎన్నికలకు ఈ వారంలో నోటిఫికేషన్ రానుంది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మే 20 లోపు పూర్తి చేయాలని, లోక్సభ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాతనే ఫలితాలను వెలువరించాలని ఎన్నికల కమిషన్ సూచించింది.

ఈ నెల 13 14 వ తారీకులలో జిల్లా , మండల పరిషత్ రిటర్నింగ్ అధికారులకు రాష్ట్ర ఎన్నికల సంఘం శిక్షణ ఇవ్వనుంది. ఈనెల 15న రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులతో ఎన్నికల కమిషన్ నాగిరెడ్డి సమావేశం కానున్నారు. ఇక 18వ తేదీన జిల్లా ఎస్పీ కలెక్టర్లతో సమావేశం కావాలని నిర్ణయించారు. జిల్లా ఉన్నత అధికారుల సమావేశంలో ఎన్నికల నిర్వహణ తేదీలపై స్పష్టత వచ్చే అవకాశముంది.

మూడు విడతల్లో రాష్ట్రంలో 32 జిల్లా పరిషత్తు, 535 మండల పరిషత్తు ఎన్నికలు నిర్వహించనున్నారు. రోజుల షెడ్యూల్ విడుదల చేసి ఈ నెల 23వ తేదీన తొలివిడత పోలింగ్ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది.

వరుస ఎన్నికల కోడ్ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి విఘాతం కలుగుతుంది. గతేడాది సెప్టెంబర్ నుండి మొదలైన ఎన్నికల కోడ్ ఈ ఏడాది మే చివరి వారం వరకు కొనసాగనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల కోడ్ ఉన్న సందర్భంగా పాలనాపరమైన ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఇబ్బంది కలుగుతుంది. అందుకే పనిలో పనిగా ఎన్నికలు కూడా నిర్వహిస్తే మరోమారు విఘాతం కలగకుండా ఉంటుందని భావించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *