ఢిల్లీలో ఎమర్జన్సీ..

Emergency In Delhi

ఔను దేశ రాజధాని ఢిల్లీలో ఎమర్జన్సీ నెలకొంది. ఐసీయూ నుంచి బయటపడినా, ఎమర్జన్సీ మాత్రం ఇంకా అలాగే కొనసాగుతోంది. అప్పుడెప్పుడు మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ విధించిన ఎమర్జన్సీ గురించి విన్నాం కానీ, ఇదేంటి కొత్త ఎమర్జన్సీ అని అనుకుంటున్నారా? తిలా పాపం తలా పిడికెడు అన్నట్లు అందరూ చేసిన తప్పులకు ఢిల్లీ నరకం అనుభవిస్తోంది. ముఖ్యంగా అక్కడి ప్రజలు కాలుష్య కోరల్లో చిక్కుకుని నరకం అనుభవిస్తున్నారు.

ఎంత దారుణమంటే.. ఎంతో గొప్పగా చెప్పుకునే ఢిల్లీలో కాలుష్యంలో చిక్కుకోవడమేమిటి? ఇంతకీ అక్కడ పాలకులు ఏం చేస్తున్నట్లు? ప్రజా పరిపాలన కొనసాగుతుందా? లేదా? అనే సందేహం సామాన్యుల్ని సైతం పట్టి పీడిస్తోంది. ఇక సుప్రీం కోర్టు రంగప్రవేశించి ఢిల్లీ, నేషనల్ క్యాపిటల్ రీజియన్లో నిర్మాణ కార్యకలాపాల్ని పూర్తిగా నిషేధించారు.

ఢిల్లీలోకి డిజీల్ ట్రక్కులను సైతం అనుమతించడం లేదు. పెరిగిన గడ్డిని ఎట్టి పరిస్థితుల్లో కాల్చకూడదని సుప్రీం కోర్టు పంజాబ్, హర్యానా, పశ్చిమ యూపీ రాష్ట్రాలను ఆదేశించింది. వ్యర్థాలను కాల్చినందుకు 17 ఎఫ్ఐఆర్లను నమోదు చేయగా, ముగ్గురిని అరెస్టు చేశారు. మరి, ఇక్కడ పరిస్థితిని అదుపులో తేవడానికి స్వయంగా సుప్రీం కోర్టు రంగంలోకి దిగడం విశేషం. మరి, ఢిల్లీని చూసి హైదరాబాద్ వంటి నగరంలోనూ కాలుష్యం పెరగకుండా కఠిన జాగ్రత్తలను తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.

Delhi Politics Updates

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *