ఎక్కడ చంపారో.. అక్కడే ఎన్‌కౌంటర్‌

Spread the love

ENCOUNTER IN DISHA KILLED SPOT

షాద్‌నగర్‌ టోల్‌గేట్‌కు సమీపంలో తొండుపల్లి జంక్షన్‌ దగ్గర సాయం చేస్తునట్టు నటించి దిశను అపహరించి హత్యాచారం చేశారు అరిఫ్‌, శివ, నవీన్‌, చెన్న కేశవులు. తర్వాత ​దిశను చటాన్‌పల్లి బ్రిడ్జ్‌ వద్ద తగలబెట్టారు. ఇంత దుర్మార్గం చేసి… ఏమీ తెలియనట్టు ఇళ్లకు వెళ్లిపోయారు. కానీ 24 గంటల్లోపే పోలీస్‌ల చేతికి చిక్కారు. విచారణ పేరుతో ​వారిని జైల్లో మేపి టైమ్‌ వేస్ట్‌ చేయొద్దు వెంటనే శిక్షించండి అన్న నినాదాలు మిన్నంటాయ్‌. ​
పోలీస్‌లు కూడా దిశ కేసును సవాల్‌గా తీసుకొన్నారు. నిందితులు శిక్ష నుంచి తప్పించుకోకుండా ఉండాలని ఏ చిన్న ఆధారాన్ని వదలకుండా శోధించడం మొదలుపెట్టారు. ​నిందితులను తమ కస్టడీకి అప్పగించాలని కోర్టును కోరారు. విచారణలో మరిన్ని విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయ్‌. ఘటనకు సమీపంలో పాతిపెట్టిన దిశ ​ఫోన్‌ను బయటికి తీశారు. లారీని మరోసారి తనిఖీ చేసి దిశ వెంట్రుకలు, బ్లడ్‌ శాంపిల్స్‌ సేకరించారు. మరింత సమాచారం రాబట్టేందుకు నిందితులను ఘటన స్థలానికి ​తీసుకెళ్లారు. సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌ చేసే ప్రయత్నం చేస్తుండగా నిందితులు పారిపోయే ప్రయత్నం చేశారు. మరి అంత దుర్మార్గం చేసి పారిపోతుంటే చూస్తూ ఊరుకుంటారా… ​తప్పనిసరి పరిస్థితుల్లో నిందితులను ఎన్‌కౌంటర్‌ చేశారు. దిశను హతమార్చి ఏ చటాన్‌పల్లి బ్రిడ్జ్‌ దగ్గర తగలబెట్టారో… అదే చటాన్‌పల్లి బ్రిడ్జ్‌ దగ్గరే నిందితులను ​ఎన్‌కౌంటర్‌ చేయడం కో- ఇన్సిడెంట్‌ అయినా- తప్పు చేసిన వాడు.. అది కూడా అమాయకురాలైన అమ్మాయి పట్ల ఇంత క్రూరంగా ప్రవర్తించిన వారు తప్పించుకుంటుంటే ​ఎవరూ మాత్రం చూస్తూ వదిలేస్తారు చెప్పండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *