ఎర్రచీర’ మొదటి షెడ్యూల్‌ పూర్తి

erra chira movie First Schedule launch
శ్రీ సుమన్‌ వెంకటాద్రి ప్రొడక్షన్‌ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న బేబి డమరి సమర్పించు హర్రర్‌ మదర్‌ సెంటిమెంట్‌ ‘ఎర్రచీర’. సుమన్‌బాబు, కారుణ్య, కమల్‌ కామరాజు, భానుశ్రీ, అజయ్‌, ఉత్తేజ్‌, మహేష్‌లు ముఖ్య పాత్రధాయిగా ఈనె 15న షూటింగ్‌ని ప్రారంభించి చిత్ర యూనిట్‌ విజయవంతంగా మొదటి షెడ్యూల్‌ని ముగించుకుంది.
కథలో ముఖ్య భూమిక పోషించిన ప్రధాన సన్నివేశాలను మొదటి షెడ్యూల్‌లో షూట్‌ చేసినట్లు, ఎంతో హృద్యంగా ఉండే ఈ సన్నివేశాలు కళ్ళను చెమర్చేలా చేస్తాయని, ఊహించిన దానికంటే ఎంతో అద్భుతంగా సీన్స్‌ వచ్చాయనీ తనకు సహకరించిన నటీనటుకి టెక్నీషియన్స్‌కి ప్రతి ఒక్కరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు దర్శకుడు సి.హెచ్‌.సుమన్‌బాబు.
ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్‌: సి.హెచ్‌.సుమన్‌ బాబు, మాటు: గోపి విమపుత్ర, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: తోట సతీష్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌: ప్రమోద్‌ పులగిల్ల, కెమెరామెన్‌: చందు, చీఫ్‌ కొ`డైరెక్టర్‌: రాజమోహన్‌, కొ`డైరెక్టర్‌: నవీన్‌రామ్‌ నల్లం రెడ్డి, కాగా ఈ చిత్రానికి మహానటి ఫేం బేబి సాయి తుషిత పాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చిత్ర యూనిట్‌ తెలిపింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *