ప్ర‌శంస‌లేనా? పైస‌లేమైనా ఇస్త‌రా?

5
Errabelli Dayakar Rao hardcore comments on Gajendra Shekawath
Errabelli Dayakar Rao hardcore comments on Gajendra Shekawath

Errabelli Dayakar Rao

రాజ్య‌స‌భ‌లో జ‌ల‌మంత్రిత్వ‌శాఖ ప‌నితీరుపై మంగ‌ళ‌వారం జ‌రిగిన చ‌ర్చ‌లో కేంద్ర జ‌ల‌శ‌క్తి మంత్రి గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్ ప్ర‌శంస‌లు కురింపించ‌డంపై రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రా శాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు కృత‌జ్ఞత‌లు, ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఈ సంద‌ర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, తెలంగాణ ప్ర‌భుత్వ ప‌ని తీరును గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తి ఇంటికి న‌ల్లా నీరు అందిస్తోంద‌ని మంత్రి పేర్కొన్నారు. అయితే, గ‌తంలోనూ వంద శాతం ఆవాసాల‌కు, ఇంటింటికీ న‌ల్లాల ద్వారా మంచినీరు అందిస్తున్న రాష్ట్రంగా, అన్ని స్కూల్స్, అంగ‌న్ వాడీ కేంద్రాల‌కు మంచినీరు అందిస్తున్న రాష్ట్రంగా, ఫ్లోరైడ్ ర‌హిత, శుద్ధి చేసిన‌‌ మంచినీటిని అందిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ‌ను కేంద్రం అభినందించిందని ‌రాష్ట్ర మంత్రి ఎర్ర‌బెల్లి అన్నారు. నీతి అయోగ్ రెక‌మండ్ చేసి‌న విధంగా నిధులు కూడా ఇస్తే బాగుంటుంద‌ని మంత్రి ఎర్ర‌బెల్లి కేంద్ర మంత్రికి విజ్ఞ‌ప్తి చేశారు.

National News Live