మధుర మీనాక్షీ ఆలయంలో బయటపడిన నేలమాళిగ

Spread the love

Error occuered in MadhuraMeenakshi Temple

దేశంలోని ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన మదురై మీనాక్షి అమ్మవారి ఆలయానికి సంబంధించిన ఒక కొత్త విషయం బయటకు వచ్చింది. మహిమలు ఉన్న అమ్మగా పేరు ప్రఖ్యాతులు ఉన్న ఈ ఆలయం కింది భాగంలో ఒక నేలమాళిగ బయటపడటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.తమిళనాడులోని ఈ దేవాలయానికి ఉన్న పేరు అంతా ఇంతా కాదు. ఈ గుడికి దగ్గరగా కారు పార్కింగ్ ఏర్పాటు చేసేందుకు కొద్ది నెలలుగా పనులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా లోతైన గుంత తీస్తుండగా.. పది అడుగుల పొడవైన రాతి స్తంభం తాజాగా బయటపడింది.

అంతే కాదు ప్రఖ్యాత మధుర మీనాక్షి అమ్మవారి ఆలయంలో ఓ రహస్య సొరంగం బయటపడింది. ఆలయం ప్రాంగణంలో మరమ్మతు పనులు జరుపుతుండగా, ఈ సొరంగాన్ని అధికారులు గుర్తించారు. అభివృద్ధి పనుల్లో భాగంగా ఆలయ ప్రాంగణాన్ని అనుకుని పార్కింగ్ షెడ్ నిర్మాణానికి తవ్వకాలు జరుపుతూ ఉండగా, పురాతన స్తూపం, 10 అడుగుల ఎత్తు ఉన్న ఓ మండపం, దాని కింద నుంచి సొరంగ మార్గం వెలుగులోకి వచ్చాయి.

దీంతో.. ఈ సొరంగ మార్గంలోని నేలమాళిగలో ఏముందన్న ఆసక్తి వ్యక్తమవుతోంది. గుడికి సమీపంలో ఉన్న నేపథ్యంలో భారీ నిధి నిక్షేపాలకు అవకాశం ఉండి ఉంటుందా? అన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇక ఈ మార్గం ఆలయం లోపలి నుంచి ప్రారంభమైనట్టు అది ఎంతవరకూ వెళ్లిందన్న విషయం మాత్రం తెలియరాలేదు. గతంలో ఈ ప్రాంతాన్ని పాలించిన రాణి మంగమ్మాళ్ దీన్ని నిర్మించి ఉండవచ్చని పురాతన శాస్త్రవేత్తలు అంచనా వేస్తుండగా, ఈ సొరంగంలో భారీ నిధి దాగుందని స్థానికులు చెబుతున్నారు. సొరంగం బయట పడటంతో తవ్వకాలను నిలిపివేసిన అధికారులు, విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళారు . దీంతో రంగంలోకి దిగిన పురావస్తు శాస్త్రవేత్తలు ఈ సొరంగం రహస్యాన్ని తేల్చే పనిలో ఉన్నారు.

Latest news

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *