తెలంగాణలో కరోనా వైరస్ లేదు .. భయం వద్దు…

Etela Rajender clarifies On CoronaVirus

ఇప్పుడు కరోనా వైరస్ ఇండియా ను సైతం వణికిస్తుంది. చైనాలో కరాళ నృత్యం చేస్తున్న కరోనా వైరస్ భారత్ లోనూ టెన్షన్ పెడుతుంది . ఇది తెలంగాణాలోనూ కనిపిస్తుంది అని వదంతులు వస్తున్న నేపధ్యంలో దీనిపై తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. సోషల్ మీడియాలో పుకార్లు వ్యాప్తి చేయడం ఆపేయాలని స్పష్టం చేశారు.తెలంగాణలో కరోనా వైరస్ లేదని, సోకిన వ్యక్తి లేరని స్పష్టం చేశారు. గతంలో స్వైన్ ఫ్లూ విషయంలో తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని, ఇప్పుడు కరోనా వైరస్ విషయంలోనూ అప్రమత్తంగానే ఉన్నామని వెల్లడించారు. అసత్య ప్రచారాలతో ప్రజలు భయపడొద్దని సూచించారు. ఆయన తెలంగాణ వైద్యఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శాంతికుమారి, ఫీవర్ ఆసుపత్రి సూపరింటిండెంట్ శంకర్, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి కరోనా వైరస్ అంశంపై సమీక్ష జరిపారు. అందరూ అప్రమత్తంగా ఉండాలని , కరోనా వైరస్ విషయంలో ఎలాంటి భయాందోళనకు గురి కావద్దని మంత్రి ఈటెల పేర్కొన్నారు.

Etela Rajender clarifies On CoronaVirus,coronavirus 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *