Ever given ship floats again
ఈజిప్ట్ లోని సూయజ్ కాలువలో చిక్కుకున్న భారీనౌక ఎవర్ గివెన్ సమస్య పరిష్కారమైంది. భారీ నౌక తిరిగి గాడిలో పడి కాలువలో ప్రయాణిస్తోందని అధికారులు తెలిపారు. ఈనెల 23 న సూయజ్ కాలువ దక్షిణ ద్వారం నుంచి 3.7 మైళ్లు ప్రయాణించిన తర్వాత ఇసుక తుపాను, తీవ్రగాలుల ధాటికి ఎవర్ గివెన్ నియంత్రణ కోల్పోయి, అడ్డంగా తిరిగింది. నౌక ముందు భాగం కాలువ అంచున ఉన్న ఇసుక, బంక మట్టిలో కూరుకుపోయిన విషయం తెలిసిందే. దీంతో అధికారులు కొన్ని రోజుల పాటు శ్రమించి సమస్యను పరిష్కరించారు.