న్యాయం చేస్తారని నమ్ముతున్నా

Ex Deputy CM Mr Rajaiah Expects Positive Result

తెలంగాణ రాష్ట్రంలో తనకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి సీఎం కేసీఆర్ అంటూ చెప్పుకొచ్చారు. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన రాజయ్య తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశానని ఎమ్మెల్యే పదవిని సైతం వదులుకున్నానని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన తనకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి సీఎం కేసీఆర్ అంటూ స్పష్టం చేశారు. వరంగల్ జిల్లాలో స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గానికి పరిమతమైన తనను తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రాజన్నగా పరిచయం చేసింది కేసీఆర్ అని స్పష్టం చేశారు. పార్టీ శిక్షణ శిబిరం నాయకత్వ బాధ్యతలు అప్పగించి తనకు ఎంతో గురుతర బాధ్యతను అప్పగించినట్లు చెప్పుకొచ్చారు. కేసీఆర్ ఆశీస్సులతో తాను రాష్ట్రవ్యాప్తంగా తిరిగానని పలు కీలక సందేశాలు ఇచ్చినట్లు రాజయ్య చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ ఆశీస్సులతోనే గెలిచినట్లు చెప్పుకొచ్చారు.

అదో గొప్ప అవకాశం
టీఆర్ఎస్ పార్టీలో ఎంతోమంది సీనియర్ నాయకులు ఉన్నప్పటికీ 2014లో టీఆర్ఎస్ఎల్పీ నాయకుడిగా కేసీఆర్ ని ప్రతిపాదించే అవకాశం తనకే ఇవ్వడం గొప్ప అదృష్టంగా భావించానని చెప్పుకొచ్చారు. అంతేకాదు తాను కలలో కూడా ఊహించని విధంగా తెలంగాణ రాష్ట్ర తొలిడిప్యూటీ సీఎంగా అవకాశం ఇచ్చిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని చెప్పుకొచ్చారు. తనకు అత్యంత ఇష్టమైన వైద్యఆరోగ్య శాఖను కట్టబెట్టడం తనకు ఒక వరమని చెప్పుకొచ్చారు. వరంగల్ జిల్లాకు కాళోజీ వైద్యవిశ్శవిద్యాలయం ఇవ్వడం తానను ఒక వరంగా భావించినట్లు రాజయ్య చెప్పుకొచ్చారు. అంతేకాకుండా తన నియోజకవర్గంలో చెరువులు నింపేందుకు ఏడు రిజర్వాయర్లు పనులకు పూర్తి చేశారని గుర్తు చేశారు. 2018 ఎన్నికల్లో తనకు టికెట్ రాకుండా కొన్ని దృష్టశక్తులు అడ్డుకున్నా వాటిని పట్టించుకోకుండా తనకు అండగా నిలిచిన వ్యక్తులు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అని చెప్పుకొచ్చారు. తనకు స్టేషన్ ఘనపూర్ టికెట్ ఇచ్చి తన గెలుపునకు సహకరించారని కొనియాడారు. తనకు ఎన్నో అవకాశాలు ఇచ్చిన కేసీఆర్ కు జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్ పార్టీలోనే ఉంటూ కేసీఆర్, కేటీఆర్ ఆదేశాలతో ముందుకు వెళ్తానని చెప్పుకొచ్చారు. కేసీఆర్ ఏ అవకాశం ఇచ్చినా దానిని చిత్తశుద్దితో పనిచేస్తానని తెలిపారు. అందర్నీ కలుపుకుపోవాలని సీఎం కేసీఆర్ నిర్ణయమని స్పష్టం చేశారు. వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో అత్యధిక సంఖ్యలో ఉన్న మాదిగ సామాజిక వర్గానికి కేసీఆర్ న్యాయం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఓర్చుకున్నవాడికి ఓర్చుకున్నంత అని వరంగల్ లో ఒక సామెత ఉండేదని గుర్తు చేశారు. మాదిగ బిడ్డలు శాంతంగా ఉండాలని సూచించారు. మాదిగ బిడ్డలు తెలంగాణ ఉద్యమంలో ముఖ్యభూమిక పోషించారని ఆ విషయం కేసీఆర్ కు కూడా తెలుసునన్నారు.

గంగుల కమలాకర్ కు మంత్రిపదవి వెనుక సీక్రెట్ ఇదే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *