నాయినికి సీరియస్

3
Ex Home minister health critical
Ex Home minister health critical

Ex Home minister health critical

మాజీ హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి ఆరోగ్యం ఆందోళనకరంగా ఉంది. గత నెల ఆయన కరోనా సోకింది. దాంతో బంజారాహిల్స్‌లోని సిటీ న్యూరో సెంటర్‌ ట్రీట్ మెంట్ తీసుకున్నారు. పది రోజుల క్రితమే మళ్లీ టెస్టులు చేసుకోవడం నెగెటివ్‌ అని తేలింది. ఆరోగ్యం కుదుటపడి త్వరలోనే ఇంటికి వస్తారనే సమయంలోనే మళ్లీ తిరబడింది. ఆయనకు ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉందని డాక్టర్లు చెప్తున్నారు. ప్రస్తుతం ఆయన జూబ్లీహిల్స్‌ అపోలో ఆసుపత్రిలో ఉన్నారు. క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌లో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. పరీక్షలు నిర్వహించగా ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్‌ అయి న్యుమోనియా సోకిందని డాక్టర్లు తేల్చారు. దీంతో నాయిని ఆక్సిజన్‌ లెవల్స్‌ పడిపోయాయి.

ఇంట్లోవాళ్లకు కూడా…

నాయినితోపాటు ఇంట్లోవాళ్లకు కరోనా వచ్చినట్లు తెలుస్తోంది. ఆయన భార్యకు నెగిటివ్ వచ్చినప్పటికీ ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. ఆయన పెద్ద కుమారుడు కూడా కరోనా బారిన పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారని సమాచారం.