ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిపై మాజీ జేడీ లక్ష్మీనారాయణ చెయ్యి చేసుకున్నారట

Ex JD Laxminarayan slapped IAS holder Sree laxmi

బీజేపీ నేత రఘురాం ఈరోజు జనసేన నేత, సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణపై సంచలన ఆరోపణలు చేశారు. ఓబులాపురం మైనింగ్ కేసు విచారణ సమయంలో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిపై జేడీ లక్ష్మీనారాయణ చేయి చేసుకున్నారని ఆరోపించారు. దీంతో శ్రీలక్ష్మి కుంగిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని శ్రీలక్ష్మి బ్యాచ్ మేట్ స్వయంగా తనతో చెప్పారని వ్యాఖ్యానించారు.

సీబీఐ జాయింట్ డైరెక్టర్ హోదాలో జేడీ ఓ మహిళ అని కూడా చూడకుండా శ్రీలక్ష్మిపై దాడిచేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఓ టీవీ ఛానల్ లో జరిగిన చర్చా కార్యక్రమంలో రఘురాం ఈ మేరకు స్పందించారు. ఇప్పుడు శ్రీలక్ష్మి నడవలేని స్థితిలో వీల్ చెయిర్ కు పరిమితమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఈ వ్యవహారంపై జనసేన నేత లక్ష్మీనారాయణ ఇంతవరకూ స్పందించలేదు.

రఘురాం చెప్పిన విషయంలో ఏ మేరకు వాస్తవం వుందో తెలీదు కానీ సీబీఐ మాజీ జేడీ పై మాత్రం ప్రజలకు మంచి నమ్మకమే ఉంది. అయన అలా చేసి వుండరు అని కొందరు చర్చిస్తున్నారు. ఒకవేళ చేస్తే ఆయన ఎలాంటి పరిస్థితిలో అలా చేసి ఉంటారో అని కూడా చర్చ పెడుతున్నారు. ఏది ఏమైనా రఘురాం వ్యాఖ్యలపై మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పందిస్తే కానీ అసలు విషయం బయటకు రాదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *