మోడీ తలుచుకుంటే కేసీఆర్ జైలుకే!

Ex ministar babumohan Hard comments

బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ పిలుపు మేరకు తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు, ధర్నాలు కొనసాగుతున్నాయి. పెద్ద ఎత్తున రోడ్లపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. బండి సంజయ్ నిరాహార దీక్ష కు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మాజీ మంత్రి బాబు మోహన్ వెళ్లారు. అనంతరం బండి సంజయ్ తో మాట్లాడారు. బండిని పరామర్శించారు. అరగంట పాటు ఎంపీతో తాజాగా జరిగిన విషయాలపై చర్చించారు. ఆ తర్వాత ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి బాబు మోహన్ కేసీఆర్ పై మండిపడ్డారు.

మామా అల్లుళ్ళ కుట్రలు పని చేయవు. ప్రధాని నరేంద్ర మోదీ కన్నెర్ర చేస్తే కేసీఆర్ జైల్లో ఉంటారు అని బాబు మోహన్ జోస్యం చెప్పారు. దుబ్బాకలో కనీస వసతులు లేవని, ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావు నియోజకవర్గాలు గజ్వేల్, సిద్దిపేట ఎలా ఉన్నాయి..? దుబ్బాక ఎలా ఉంది?. రఘునందన్ మీద కేసీఆర్ కుట్రలు పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ కలెక్టరేట్ ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన జరుగుతోంది. సీఎం కేసిఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. దుబ్బాకలోని పరిస్థితులను ఎప్పటికప్పుడు బీజేపీ అధిష్టానానికి తెలియజేస్తున్నారు బీజేపీ నాయకులు. అమిత్ షా కూడా ఇక్కడి పరిస్థితులను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *