EX MINISTER BEATEN WOMEN
తెలుగు దేశం పార్టీ నేతలకు అదేం పిచ్చో తెలియదు. బహిరంగంగా, రోడ్డు మీదే సొంత కార్యకర్తల మీదే తమ ప్రతాపం చూపెడుతుంటారు. అభిమానులు ఏమాత్రం అత్యుత్సాహం చూపెడితే చాలు.. అక్కడే చెడామడా తిట్టేస్తారు. అంతటితో ఆగకుండా ఇష్టం వచ్చినట్లు పిడిగుద్దులు గుద్దుతారు. అసలు వీళ్లను తాము ఇంతవరకూ ఎందుకు అభిమానించామా? అని బాధపడేలా ప్రవర్తిస్తుంటారు. అభిమానుల మీద పిడిగుద్దులు గుద్దే వారిలో బాలయ్య బాబు ముందంజలో ఉంటారనే విషయం తెలిసిందే. తాజాాగా, ఈ కోవలోకి చేరారు.. విజయనగరం జిల్లాలకు చెందిన కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు. ప్రపంచ మహిళా దినోత్సవం నాడు ఆయనేం చేశాడో తెలుసా? విజయనగరం జిల్లాలో ప్రచారాన్నికి వచ్చిన మహిళ ను చితకొట్టారు. ఇంతకీ ఆ మహిళ చేసిన తప్పేమిటంటే.. తమ అభిమాన నేత వచ్చారని గౌరవంతో పువ్వులు జల్లడమే. కనీసం విచక్షణ లేకుండా వెనుతిరిగి మెడ వంచి మరీ ఆమెను చితకొట్టారు. దీంతో, అవమానంతో మహిళా కార్యకర్త పక్కకు వెళ్లిపోయారని తెలిసింది. కాబట్టి, తెలుగు దేశం పార్టీ కార్యకర్తల్లారా, జాగ్రత్త. మీ అభిమానాన్ని మరీ ఎక్కువగా చూపించకండి. అనవసరంగా అవమాన పాలు కాకండి.