కాంప్రమైజ్ అయిన మాజీ మంత్రి నాయిని

EX MINISTER NAYANI NARASIMHA REDDY WAS COMPROMISED

మాజీ హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి మంత్రివర్గ విస్తరణ నేపధ్యంలో సీఎం కేసీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ తనకు మంత్రిగా అవకాశం కల్పిస్తానని చెప్పి ఇచ్చిన మాట తప్పారని ఆయన మండిపడ్డారు. హోం మంత్రిగా చేసిన తాను ఆర్టీసీ చైర్మన్ వంటి చిన్న పదవి చేస్తానా అంటూ ఓ రేంజ్ లో రెచ్చిపోయిన నాయిని నరసింహా రెడ్డి మాట మార్చారు. గులాబీ పార్టీ కి ఓనర్ నని చెప్పిన ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి.మొన్నటికి మొన్న తాను కూడా గులాబీ పార్టీ ఓనర్ నేనని , కిరాయికి వచ్చిన వాళ్ళు ఎంతకాలం ఉంటారో చూస్తానని మంత్రులను ఉద్దేశించి చేసిన నాయిని నరసింహారెడ్డి వ్యాఖ్యలు ఆసక్తికర చర్చకు కారణం అయ్యాయి. ఆయనకు కార్పొరేషన్ చైర్మన్ గా అవకాశం ఇస్తారని తాజాగా ప్రచారం జరుగుతున్న నేపద్యంలో తనకు ఏ కార్పోరేషన్ పదవి వద్దని నాయిని నర్సింహరెడ్డి తేల్చి చెప్పారు.హోం మంత్రి పదవి నిర్వహించిన తాను కార్పోరేషన్ ఛైర్మెన్ పదవిని చేస్తానా అని నాయిని నరసింహారెడ్డి ప్రశ్నించారు. కార్పోరేషన్ ఛైర్మెన్ పదవి ఎవరికి కావాలని ఆయన మండిపడ్డారు. అయితే ఇదంతా మీడియా సృష్టే అని నాయిని మరోమారు మాట మార్చి చెప్పారు.టీఆర్ఎస్ పార్టీ తమదేనని, అందులో ఉన్న పదవులు కూడా తమకే వస్తాయని మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో నిర్వహించిన చిట్ చాట్ లో తాజాగా మీడియాలో వచ్చిన వార్తలపై తనను కేటీఆర్‌ ప్రశ్నించారని చెప్పిన ఆయన తాను మీడియాతో ఏదో చిన్నగా చిట్‌చాట్‌ చేస్తే చాలా పెద్ద వార్తగా రాశారని చెప్పారు. తాజాగా మంత్రి వర్గ విస్తరణ అనంతరం ఆయన ఆర్టీసీ ఆర్టీసీ కార్పొరేషన్‌ పదవిలో రసం లేదని వ్యాఖ్యానించారు. ఇక ఇప్పుడు మాట మార్చిన నాయిని ఇప్పుడు అదే ఆర్టీసీ కార్పొరేషన్ పదవి ఇచ్చినా రసం వాళ్లే పోస్తారని వ్యాఖ్యానించారు. తనని సీఎం పిలిస్తే వెళ్తానని మాట్లాడతానని నాయిని అన్నారు.ఇక ఆ పదవి ఇచ్చినా చేసేందుకు నాయిని సిద్ధం అయిపోయారు.

TELANGANA FIRST TRIBAL WOMEN MINISTER

 

Related posts:

ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు ఉన్నావ్ రేప్ కేస్...
టిక్ టాక్ లో వీడియో చేసి....
నిందితులకు 14 రోజుల రిమాండ్
ప్రియాంక రెడ్డి హత్య..షాద్‌నగర్ లో ఉద్రిక్తత
బ్రేకింగ్ న్యూస్.. అచ్చెన్నాయుడుకు కారు ప్రమాదం
ప్రియాంకా రెడ్డి హత్య కేసు నిందితులను కోర్టుకు...
తిరుమల కొండపై ప్రైవేట్ హోమం
ప్రియాంకా రెడ్డి హత్యపై జాతీయ మహిళా కమీషన్ సీరియస్
ప్రియాంక కేసులో నిందితులు వీరే...మంత్రి తలసాని పరామర్శ
ఫోటోల కోసం ఫోజులివ్వడానికి వచ్చావా
ఆర్టీసీ కార్మికులను చేర్చుకుంటాం: కేసీఆర్
ప్రియాంక స్కూటీ పంచర్ చేశారా? వారి పనేనా?
ప్రియాంక రెడ్డి హత్య కేసులో 15 బృందాలతో గాలింపు
వెటర్నరీ డాక్టర్ ప్రియాంకా రెడ్డి సజీవ దహనం
జార్జ్‌ చనిపోవడానికి ముందు ఎం జరిగిందంటే...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *