EX mp Jithendar warns to Harish rao
దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ కు ఓటమి భయం పట్టుకుందని, అందుకే పోలీసుల చేత దాడులు చేయిస్తున్నారని మాజీ ఎంపీ జితేందరర్ రెడ్డి ఆరోపించారు. హరీష్రావు ఓటమి భయంతో ఇలాంటి ఎత్తుగడలు వేస్తున్నారని అన్నారు. హరీష్రావు ఆటలు సాగనీయమన్నారు. బీజేపీ కార్యకర్తలు డబ్బులు ఎత్తుకెళ్ళలేదు..అవి పోలీస్ వాళ్ళు తెచ్చారని చూపించారని పేర్కొన్నారు. కాగా వీడియోలు చూస్తే పోలీసులే డబ్బులు తెచ్చినట్టు ఉన్నాయని పలువురు బీజేపీ నాయకులు అన్నారు. ఈ విషయాన్ని కేంద్రమంత్రి అమిత్ షాకు చెప్పామని బీజేపీ నాయకులు అంటున్నారు.