F2 movie received Central award
ఫన్ అండ్ ఫస్ర్టేషన్ అంటూ నవ్వుల పూలు పూయించింది ఎఫ్2 మూవీ. అందుకే పలు అవార్డులు వరించాయి. తాజాగా 2019కి గానూ వివిధ భాషలకు చెందిన 26 సినిమాలకు కేంద్ర సమాచార ప్రసారశాఖ అవార్డులు ఇచ్చింది. ఇందులో గతేడాది జనవరిలో విడుదలైన ‘ఎఫ్ 2’ సినిమాకు కేంద్ర అవార్డు లభించింది. లాస్ట్ ఇయర్ సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ విజయాన్ని సొంతం చేసుకుంది. వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా తమన్నా, మెహ్రీన్ కౌర్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు దిల్రాజు సినిమాను నిర్మించారు.