కోట్లాది యూజర్ల పాస్ వర్డ్స్ టెక్స్ట్ రూపంలో దాచిన ఫేస్ బుక్

Face Book for billions of users' passwords text

ఫేస్ బుక్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫేమస్ సోషల్ నెట్వర్కింగ్ యాప్. ఈ యాప్ లో అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరు తమ అకౌంట్ భద్రత కోసం పాస్ వర్డ్ పెట్టుకుంటారు. తప్ప వేరే ఎవరికీ తెలియకూడదు అని చాలా జాగ్రత్తగా పాస్ వర్డ్ ను సెట్ చేసుకుంటారు. ఇక తమ పాస్ వర్డ్, తమ అకౌంటు పదిలం గా ఉందని, తమ వ్యక్తిగత సమాచారాన్ని ఎవరూ చూసే అవకాశం లేదని సంబరపడిపోతూ ఉంటారు.మీ ఫేస్ బుక్ పాస్ వర్డ్ మీకు మాత్రమే తెలుసు అని ఫీల్ అవుతున్నారా? మీ పాస్ వర్డ్ తెలిసినవారు వేరే వారు ఉన్నారు అంటే మీకు నమ్మశక్యంగా లేదా ? మీరు నమ్మలేకున్నా ఇది నిజం. మీ ఫేస్ బుక్ పాస్ వర్డ్ తెలిసినవారు ఇంకా చాలామంది ఉన్నారని స్వయానా ఫేస్ బుక్ ఒప్పుకుంది.

కోట్లాది యూజర్ల పాస్ వర్డ్స్ ఫేస్ బుక్ ఉద్యోగులకు తెలుసట.. వారు యూజర్ల పాస్ వర్డ్స్ అన్నీ చూసేశారట. సెక్యూరిటీ స్లిప్ వల్ల యూజర్ల పాస్ వర్డ్స్ ను ఫేస్ బుక్ ఉద్యోగుల చూశారని స్వయాన ఫేస్ బుక్ ఒప్పుకుంది. పాస్ వర్డ్స్ ను టెక్స్ట్ రూపంలో దాచినట్టు వెల్లడించింది. బయట వారెవరికీ తెలిసి ఛాన్స్ లేదని , నేటి వరకు ఎవరు పాస్ వర్డ్స్ ను దుర్వినియోగం చేయలేదని ఫేస్ బుక్ ఇంజనీరింగ్ మరియు సెక్యూరిటీ వైస్ ప్రెసిడెంట్ పెడ్రో కనాహువాటి తెలిపారు. ఏది ఏమైనా వాళ్ళు దుర్వినియోగం చెయ్యటం లేదు అని చెప్పినా మన ఫేస్ బుక్ అకౌంట్స్ కు సేఫ్టీ లేదని అర్ధం అయ్యింది. మనం ఎంతో గుట్టుగా దాచుకునే పాస్ వర్డ్స్ అన్నీ వాళ్ళ దగ్గర వున్నాయని తెలిసిపోయింది .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *