డాక్టర్ నని చెప్పి యువతులను మోసం చేస్తున్న కేటుగాడు

Spread the love

FAKE DOCTOR ASSAULTED AND CHEATED WOMENS

వాడొక మోసగాడు … అమ్మాయిలను డాక్టర్ అని నమ్మించి మోసం చెయ్యటమే అతని పని .తానొక ఫేమస్ డాక్టర్ నని అమ్మాయిలను పరిచయం చేసుకొని.. అమ్మాయిలకు వల వేసి.. వారి దగ్గర నుంచి డబ్బులు గుంజుతున్న కేటుగాడిని పోలీసులు అరెస్టు చేశారు. బాధిత యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కర్నూలు జిల్లాకు చెందిన అబ్దుల్లా కూకట్‌పల్లిలోని సిఫా ఎలక్ట్రికల్స్‌లో సివిల్‌ ఇంజనీర్‌గా పనిచేసేవాడు. అతను డేటింగ్‌ వెబ్‌సైట్‌లో డాక్టర్ గా నకిలీ ఐడీ సృష్టించి యువతులు, వివాహితులతో చాటింగ్‌ చేసేవాడు.

అనంతరం వారి ఫొటోలు, వీడియోలు తీసుకొని తన సెల్‌ఫోన్‌లో నిక్షిప్తం చేసుకునేవాడు. డాక్టర్‌ కార్తీక్‌ రెడ్డి పేరుతో నకిలీ ఐడీ సృష్టించిన అతను నగరంలోని ఓ ప్రధాన ఆస్పత్రిలో అనస్తటిస్ట్‌గా పనిచేస్తున్నట్లు చెప్పుకుని ఓ యువతితో పరిచయం చేసుకున్నాడు. ఆ తర్వాత కొన్నాళ్లపాటు చాటింగ్‌ చేసిన అతను బాధితురాలి వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు తీసుకున్నాడు. అయితే అతడి ప్రవర్తనపై అనుమానం వచ్చిన ఆమె అతడిని దూరం పెట్టింది. దీనిని గ్రహించిన అబ్దుల్లా నీ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని.. కుటుంబసభ్యులకు చూపెడతానంటూ బెదిరించడం మొదలుపెట్టాడు. రూ.4 లక్షలు ఇవ్వడంతో పాటు తన కోరిక తీర్చాలని ఆమెను వేధించడం మొదలుపెట్టాడు.

దీంతో బాధితురాలు గత నెల 24న సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో మంగళవారం పుప్పలగూడలో నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *