ఐఏఎస్ అంటూ 25మంది యువతుల్ని

Fake IAS Officer In Matrimony Site

మోసపోయే వాళ్ళు ఉన్నంత కాలం మోసం చేసే వాళ్ళు ఉంటారు . ఇక అలాగే ఒక ప్రబుద్ధుడు చేసిన మోసం  తెలిస్తే తప్పక షాక్ అవుతారు. తాను కలెక్టర్ అని చెప్పి, అందుకు తగినట్టు ఫోటోలు తీసి మ్యాట్రిమోనల్ సైట్‌లో అప్‌లోడ్  చేసిన ఒక మోసగాడు 25 మంది అమ్మాయిలను నిలువు  దోపిడీ చేశారు.  ఒక్కో అమ్మాయి అతని వలలో చిక్కి చేతిచమురు వదిలించుకున్నారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో జరిగిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.

తాను ఐఏఎస్  అధికారిని అని చెప్పి ముంబైలో ఒక కేటుగాడు అమాయిలను మోసం చేశాడు . దిందోసి పోలీసు స్టేషన్ పరిధిలో నమోదైన కేసు వివరాలను చూస్తే  ఆదిత్య మాత్రే (32) అనే సివిల్ ఇంజినీర్ తాను కలెక్టర్ అని చెప్పి, ఫోజు కోడుతూ అమ్మాయిల నుంచి అందినకాడికి డబ్బులు లాగేశాడు. ఫారిన్ కార్ల ముందు ఫోటోలు దిగి  సివిల్ ఇంజినీర్ అయిన ఆదిత్య మ్యాట్రిమోనల్ వెబ్‌సైట్‌‌లో తాను ఐఏఎస్ అధికారి అని పెట్టుకున్నాడు.  ఇంకేముంది ఆదిత్య, కాస్ల్టీ కార్లను చూసి అమ్మాయిలు నిజమే అనుకొన్నారు. మెల్లగా కొందరు అతనితో చాట్ చేయడం ప్రారంభించారు. ఇంకేముంది తనకు ఇతర అవసరాలు ఉన్నాయని పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. అలా ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.5 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు నగదు తీసుకున్నాడు . అతని లగ్జరీ ఫోటోలు చూసి నమ్మిన అమ్మాయిలు తమ దగ్గర ఉన్నది సమర్పించుకున్నారు. ఆ తర్వాత పత్తా లేకుండా పోవటంతో  25 మంది మోసపోయారు. అయితే దిందోసి పోలీసు స్టేషన్‌లో యువతి ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు.. ఆదిత్యను అరెస్ట్ చేశారు. అతనిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తీగ లాగితే డొంక కదిలింది.

Fake IAS Officer in Mumbai, Adithya Mathre, Fake IAS, Matrimony Website, Girls, Trap, Money, cheating, case filed, police,Cyber Crime

Related posts:

అమరసైనిక కుటుంబాలకు పవన్ కోటి విరాళం...
ఎయిర్‌సెల్- మ్యాక్సిస్ కు డెడ్ లైన్...
భారతీయుడు2 షూటింగ్‌లో దారుణం..3 డైరెక్టర్లు మృతి
హస్తినకు జనసేనాని .. ఎందుకంటే
నితీష్ ఎన్డీయేలో కొనసాగక్కర్లేదు?
వంద మొక్కలు నాటాల్సిందిగా హైకోర్టు శిక్ష  
మార్చి3న నిర్భయ దోషులకు ఉరి ..
రైల్లో శివుడికి బెర్త్ .. మండిపడిన ఓవైసీ
ఇంధన సమస్యతో అత్యవసరంగా ఛాపర్..
జేడీకు ఆ పార్టీ నుండి ఆహ్వానం...
ఐ-ప్యాక్ డైరెక్టర్ వివాహం ..వెళ్తున్న సీఎం జగన్
టెలికాం కంపెనీలకు షాక్ ఇచ్చిన సుప్రీం...
నేడే కేజ్రీవాల్ సీఎంగా ప్రమాణ స్వీకారం
68 మంది విద్యార్థినుల అండర్ వేర్ విప్పించి...
హైదరాబాద్ లో మంత్రి నిర్మలా సీతారామన్...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *