అభిమానుల అత్యుత్సాహం

Fantastic Fans

.. పవన్ నే కింద పడేశారుగా

ఇటీవ‌ల కాలంలో రాజ‌కీయ నేత‌ల‌ప‌ట్ల వారి అభిమానులు చూపుతున్న అత్యుత్సాహం ఆందోళ‌న‌కు గురి చేస్తోంది. మొన్న‌టికి మొన్న జ‌న‌శాంతి పార్టీ అధ్య‌క్షుడి మెడ‌లోని చైన్‌ను ఎవ్వ‌రికీ తెలీకుండా ఆయ‌న అభిమానే చోరీ చేశాడు. సేమ్ సీన్ వైసీపీ నాయ‌కురాలు వైఎస్ ష‌ర్మిల బ‌స్సు యాత్ర‌లోనూ చోటు చేసుకుంది. బ‌స్సు విండో నుంచి చేయి బ‌య‌ట‌పెట్టి అభివాదం చేస్తున్న క్ర‌మంలో ష‌ర్మిల చేతికి ఉన్న ఉంగ‌రాన్నే చోరీ చేశాడు. పాల్‌, ష‌ర్మిల‌కు సంబంధించిన వీడియోలు ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు ఆ జాబితాలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌కు సంబంధించిన వీడియో ఒక‌టి వ‌చ్చి చేరింది. కాగా, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇవాళ విజ‌య‌న‌గ‌రంలోని అయోధ్య మైదానంలో నిర్వ‌హించిన జ‌న‌సేన బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌సంగించేందుకు వ‌చ్చారు. వేదిక‌పైకి ఎక్కి మాట్లాడ‌బోతున్నార‌న‌గా వెన‌క నుంచి వ‌చ్చిన ఓ అభిమాని ప‌వ‌న్ కాళ్ల‌ను ప‌ట్టుకున్నారు. దీంతో అదుపు త‌ప్పిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఒక్క‌సారిగా కింద ప‌డిపోయారు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ కింద‌ప‌డే స‌మ‌యంలో ముందుగా త‌న ఎడ‌మ చేతిని నేల‌పై పెట్టటంతో వ్రేళ్ల‌కు తీవ్ర గాయాల‌య్యాయి. అంతే కాక ఎండల్లో ప్రచారం చెయ్యటం వల్ల పవన్ బాగా నీరసిమ్చిపోయారు.వడదెబ్బ తగిలి అస్వస్థతకు గురయ్యారు. దీంతో స‌మీపంలోని ఆస్ప‌త్రికి చేరుకుని చికిత్స పొందారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ చికిత్స పొందుతున్న స‌మ‌యంలో తీసిన వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు గాయాలు కావ‌డం, అనారోగ్యంగా ఉండటంతో జ‌న‌సేన ప్ర‌చార స‌భ‌లు కొన‌సాగుతాయా..? లేక ఒక రోజుపాటు విరామం ప్ర‌క‌టించే అవ‌కాశం ఉందా..? అన్న ప్ర‌శ్న‌లు ఇప్పుడు ఆ పార్టీ శ్రేణుల మ‌దిలో త‌లెత్తుతున్నాయి.

TSnews Politics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *