ఆత్మహత్యలు చేసుకొన్న రైతు కుటుంబాలకు

Spread the love

farmer S family SUICIDE

రైతు సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ జగన్ పాలన సాగించాలని చూస్తున్నారు. అందుకోసం ఆయన ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తమ ప్రభుత్వం రైతాంగానికి అండగా నిలుస్తోందని మాటలకే పరిమితం కాదు…ఆచరణలో కూడ తాము ముందుంటామని జగన్ సంకేతాలు ఇచ్చారు. ఆత్మహత్యలు చేసుకొన్న రైతుల కుటుంబాలకు రూ. 7లక్షల పరిహారాన్ని చెల్లించాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకొన్నారు.ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు ఆయన ఆదేశాలు జారీ చేశారు.

బుధవారం నాడు స్పందన కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఏపీ సీఎం జగన్ మాట్లాడారు. ఆత్మహత్యలు చేసుకొన్న రైతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని ఆయన కలెక్టర్లను ఆదేశించారు. గత ఐదేళ్లలో సుమారు 1513 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకొంటే.. కేవలం 391 మంది రైతులకు మాత్రమే పరిహరం చెల్లించినట్టుగా జిల్లాల నుండి సమాచారం అందింది.అయితే ఆత్మహత్యలు చేసుకొన్న కుటుంబాలకు పరిహరం చెల్లించాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఒక్కో కుటుంబానికి రూ. 7 లక్షలను పరిహారంగా ఇవ్వాలని సీఎం స్పష్టం చేశారు. ఆయా జిల్లాల్లో ఆత్మహత్యలు చేసుకొన్న రైతుల కుటుంబాల ఇంటికి వెళ్లి జిల్లా కలెక్టర్లు నేరుగా పరిహారం చెల్లించాలని జగన్ సూచించారు.

7 LAKHS COMPENSATION FOR FARMERS FAMILY

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *