Fast food effect to ladies
అమ్మాయిలు ఫాస్ట్ ఫుడ్ తెగ తింటున్నారా? అయితే ఒక్కసారి ఆలోచించి తినండి మరి. ఫాస్ట్ తినడం వల్ల బరువు సమస్యలే కాకుండా, ఇతర సమస్యలు కూడా ఉన్నాయట. రాబిన్సన్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ వారు పరిశోధనలు చేసి మరి చెప్పారు. ఇంతకీ ఎంటంటే…?
ఫాస్ట్ ఫుడ్ ఆడవాళ్లలో సంతానపరమైన సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని తేల్చి చెప్పింది. దాదాపు ఐదు వేల మంది మహిళలపై రీసెర్చ్ చేయగా, ఫాస్ట్ ఫుడ్ తినేవాళ్ల సంతానపరమైన సమస్యలతో ఇబ్బందులు పడుతున్నట్లు తేలింది. జంక్ ఫుడ్ ఎక్కువగా తినేవాళ్లు గర్భం దాల్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని రీసెర్చ్ లో తేలింది. ఫాస్ట్ ఫుడ్ కు బదులు పండ్లు, కూరగాయలు, చేపలు తింటే ఆడవాళ్లలో సంతాన సామర్థ్యం పెరుగుతుందని పరిశోధకులు చెప్తున్నారు.