నిజామాబాద్ పోరులో నువ్వా నేనా

Fight Between TRS BJP In Nizamabad

మునిసిపల్ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతుంది. నిజామాబాద్ జిల్లాలో టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ప్రచారంలో నువ్వా నేనా అంటున్నాయి.  ప్రచారంలో భాగంగా ఇరు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. నిజామాబాద్‌ కార్పొరేషన్‌లో గెలుపొంది మేయర్‌ పదవిని చేపడితే వెంటనే నిజామాబాద్‌ పేరును ఇందూరుగా మారుస్తూ మొదటి సంతకం చేస్తామన్నారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. అయితే కార్పోరేషన్ మేయర్ పదవిని ఎంఐఎంకు కట్టబెట్టేందుకు టీఆర్ఎస్ చూస్తొందన్న ఆయన ఆరోపణపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే గణేష్ బిగాల కౌంటర్ ఇచ్చారు.

టీఆర్ఎస్ అభ్యర్థి మేయర్ కాకుండా.. ఎంఐఎంకు మేయర్ స్థానాన్ని కట్టబెడితే.. ప్రెస్ క్లబ్ నుంచి కంఠేశ్వర్ గుడి వరకు ముక్కు నేలకు రాస్తానని ఎమ్మెల్యే గణేష్ బిగాల సవాల్ విసిరారు. అరవింద్‌ మాదిరిగా బాండ్ పేపర్లు రాసి మాట మార్చే అవసరం తమకు లేదన్నారు. ఎవరెన్ని చేసినా నిజామాబాద్‌లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని ఎమ్మెల్యే జోస్యం చెప్పారు. మరోవైపు బీజేపీ ఎంపీ అరవింద్ కూడా మేయర్‌ సీటు తమదేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.దీంతో నిజామాబాద్ లో పోరు ఉత్కంగా మారింది.

Fight Between TRS BJP In Nizamabad,nizamabad, municipal elections, trs , bjp, nizamabad corporation , mp aravind , mla ganesh bigala

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *