వైసీపీ శ్రేణుల మధ్య బాహాబాహీ

Spread the love

Fight between YSRCP Politicians

కర్నూలు, గుంటూరు జిల్లాల్లో టీడీపీ ,

ఏపీలో జరుగుతున్న పోలింగ్ లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంటుంది. అధికారులు, పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తూ పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. అహోబిలంలో భూమా, గంగుల వర్గాల మధ్య వివాదం తలెత్తింది. అక్కడకు వెళ్లిన భూమా అఖిల ప్రియను వైసీపీ నేతలు అడ్డుకున్నారు. రెండు వర్గాల మధ్యా ఉద్రిక్తలు పెరిగి… ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు ఎంతకీ రెండువైపుల వారూ వెనక్కి తగ్గకపోవడంతో బలవంతంగా చెదరగొట్టారు. ఇలా మొన్నటిదాకా ప్రశాంతంగా ఉన్న ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఒక్కసారిగా కలకలం రేగినట్లైంది. ప్రస్తుతం అక్కడ ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్నాయి. ఈ ఉద్రిక్తల ప్రభావం పోలింగ్ పై పడకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

గుంటూరు జిల్లా… గురజాలలోని శ్రీనివాసపురంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. టీడీపీ-వైసీపీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు. ఆవేశాలకుపోయి చివరకు కొట్టుకునేదాకా వెళ్లారు. ఘర్షణ కారణంగా అక్కడి పోలింగ్ సామగ్రి ధ్వంసమైంది. పరిస్థితి అదుపుతప్పడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చి… రెండు వర్గాల వారినీ కంట్రోల్ చేస్తున్నారు. ఎవరికి వాళ్లు తప్పు ప్రత్యర్థి పార్టీదేనని చెబుతూ… ఆవేశంగా మాట్లాడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *